
Omicron Tension: ఒకటి పోతే ఇంకోటి అన్నట్టు కరోనా ఫస్ట్ వేవ్ పీడ విరగడైంది అనుకున్న సమయంలోనే సెకండ్ వేవ్ అంటూ ఎంతో మంది ప్రజలను బలితీసుకుంది కరోనా మహమ్మారి. సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయనుకున్న సమయంలోనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామిలా విరుచుకుపడుతోంది. దీనికి తోడు చలికాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. తీవ్రమైన జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు సీజనల్ వ్యాధులు మరో వైపు ఒమిక్రాన్ టెన్షన్ తో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకవేళ కరోనా పాజిటీవ్ అని నిర్దారన అయితే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. అందులోనూ బ్రిటన్ లో ఈ కేసులు అన్ని దేశాలకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఇండియాలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ఒకరి నుంచి వేరొకరికి చాలా ఫాస్ట్ గా సోకుంతుందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ వేరింట్ సోకితే తేలిక పాటి లక్షణాలే ఉంటాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. కాగా ఒమిక్రాన్ సోకితే జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది ఖచ్చితంగా ఒమిక్రానేనని నిర్దారించుకోవడానికి వీలు లేదు. ఒక వేళ మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కరోనా టెస్టు చేసుకోవాలి. అలాగే ఐసోలేషన్ కు వెళ్లడం మర్చిపోవద్దు.
కరోనా నుంచి తొందరగా బయటపడాలన్నా.. నలుగురికి ఈ వైరస్ ను అంటించకూడదన్నా ఐసోలేషన్ కు వెళ్లడం ఉత్తమ మార్గం. పాజిటీవ్ అని నిర్ధారణ అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. శానిటైజేషన్ ను మర్చిపోవద్దు. అలాగే సోషల్ డిస్టెన్స్ తప్పని సరిగా పాటించాలి. ఇక వీటన్నింటికంటే హోం ఐసోలేషన్ లో ఉండటం చాలా మంచిది. ఐసోలేషన్ లో ఉండటం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటంటే.. మీ నుంచి మరొకరికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండదు. అయితే ఐసోలేషన్ లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురైనా, చెస్ట్ నొప్పిగా అనిపించినా డాక్టర్లను సంప్రదించడం మర్చిపోవద్దు.
కాగా ఒమిక్రాన్ నిర్దారణ అయితే 10 రోజుల పాటుగా ఖచ్చితంగా ఐసోలేషన్ లోనే ఉండాలని సీడీసీ చెబుతోంది. ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత కరోనా నిర్దారణ పరీక్ష మళ్లీ చేయించుకోవాలి. ఇక అందులో నెగిటీవ్ వస్తే కూడా మరో వారం రోజులు isolation లో ఉండటం మంచిది. ఇకపోతే దీని నుంచి కోలుకున్నా కూడా పోస్ట్ కోవిడ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సరైన ఫుడ్, వ్యాయామం వంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి తొందరగా బయటపడొచ్చు.