దేశంలో వీరికి హెల్మెట్‌ నుంచి మినహాయింపు ఉందని మీకు తెలుసా.? కారణం ఏంటంటే..

By Narender Vaitla  |  First Published Dec 29, 2024, 4:01 PM IST

దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో పలు నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానాలు విధిస్తుంటారు. బైక్‌ ఎక్కితే కచ్చితంగా హెల్మెట్‌ ధరించాల్సిందే. అయితే దేశంలో కొందరికి హెల్మెట్‌ ధరించడం నుంచి మినహాయింపు ఉంది. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


దేశంలో రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదం అనేది మన చేతిలో ఉండదు. కానీ ప్రమాదం కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం మాత్రం మన చేతిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు భద్రతా రూల్స్‌ను పాటించడం ద్వారా వీలైనంత వరకు ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం. అదే విధంగా ఒకవేళ ప్రమాదం జరిగిన చిన్న చిన్న గాయాలతో బయటపడొచ్చు. వీటిలో ప్రధానమైంది హెల్మెట్‌ ధరించడం. 

ప్రాణాలతో బయటపడొచ్చు

ద్విచక్ర వాహనాల ద్వారా జరిగే మెజారిటీ ప్రమాదాల్లో తలకు గాయాలయ్యే మరణిస్తుంటారు. అందుకే నాణ్యమైన హెల్మెట్‌లను ధరించాలని ప్రభుత్వాలు, అధికారులు సూచిస్తుంటారు. ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న హెల్మెట్‌లను ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. అందుకే అధికారులు హెల్మెట్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం బైక్‌ను నడిపించే వ్యక్తి మాత్రమే కాకుండా వెనకాల కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ను ధరించాలనే నిబంధన ఉంది. మోటారు వాహన చట్టంలో ఈ నిబంధనను స్పష్టంగా పేర్కొన్నారు. 

భారీగా ఫైన్‌ 

Latest Videos

హెల్మెట్‌ ధరించకుండా వాహనాన్ని నడిపిస్తే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించే హక్కు ఉంటుంది. రైడర్‌తో పాటు వెనకాల ఉన్న వారు ధరించకపోయినా వెంటనే ఫొటోలు క్లిక్‌ మంటుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి రూ. 5000 వరకు చలాన్‌ విధించే అవకాశాలు ఉంటాయి. అయితే కొందరికి మాత్రం హెల్మెట్‌ నుంచి మినహాయింపు ఉంది. వీరు హెల్మెట్‌ ధరించకపోయినా ఎలాంటి జరిమానాలు చెల్లించరు. 

4 ఏళ్లులోపు.. 

4 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు తలకు హెల్మెట్‌ ధరించాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోంది. 4 ఏళ్లు దాటిన చిన్నారులు కూడా కచ్చితంగా హెల్మెట్‌ను ధరించాల్సిందే. ఆ చిన్నారి వెనకాల కూర్చున్న హెల్మెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక భారత్‌లో సిక్కు కమ్యూనిటీకి చెందిన వారు కూడా హెల్మెట్‌ ధరించకుండా ఉండొచ్చు. అయితే సిక్కు మతంలో ఉండి తలపాగా ధరించే వారికి మాత్రమే ఈ మినహాయింపు అమల్లో ఉంది. సిక్కు కమ్యూనిటికీ చెందిన వారు తలపాగా ధరిస్తారనే విషయం తెలిసిందే. అందుకే వీరికి హెల్మెట్ ధరించడం నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు హెల్మెట్‌ లేకున్నా జరిమానా నుంచి మినహాయింపు పొందొచ్చు. అయితే ఇది దేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!