మధ్యాహ్నం పడుకోవడం వల్ల బరువు పెరిగిపోతూ ఉంటాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, అందులో నిజం ఎంత? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
మధ్యాహ్నం నిద్రపోవాలని చాలా మందికి ఉంటుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ, మధ్యాహ్నం నిద్ర వల్ల బరువు పెరుగుతాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీనిలో నిజం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల బరువు పెరగరు. కానీ, మీ జీవనశైలి సోమరితనంతో కూడుకుని ఉండి, తినే ఆహారం సరిగ్గా లేకపోతే, ఎక్కువసేపు నిద్రపోతే లేదా భారీ భోజనం తర్వాత వెంటనే పడుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. తెలివిగా కొంతసేపు నిద్రపోతే మనసుకీ, శరీరానికీ మంచిది. మధ్యాహ్నం నిద్ర వల్ల బరువు పెరుగుతారా అనేది ఇప్పుడు చూద్దాం.
మధ్యాహ్నం నిద్ర వల్ల బరువు, ఊబకాయం పెరుగుతాయా
బరువు పెరగని సందర్భాలు:
తేలికపాటి భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే.