Toilet Cleaning: టాయ్ లెట్ మొండి మరకలను ఇలా శుభ్రం చేయచ్చు..!

Published : May 13, 2025, 04:17 PM IST
Toilet Cleaning: టాయ్ లెట్ మొండి మరకలను  ఇలా శుభ్రం చేయచ్చు..!

సారాంశం

తరచుగా మూత్ర విసర్జన తర్వాత, కొన్ని చుక్కలు టాయిలెట్ సీటుపై పడటం మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత అక్కడ పసుపు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ టాయిలెట్ సీటును శుభ్రం చేయడం సాధ్యం కాదు.

బాత్రూమ్ అనేది మన ఇంట్లో మనం శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ప్రదేశం. ఇంటిని మాత్రమే కాదు, బాత్రూమ్ లోని ప్రతి వస్తువును చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా బాత్రూమ్ లోని టాయ్ లెట్ సీటు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.మనం దానిని ప్రతిరోజూ ఉపయోగిస్తూ ఉంటాం. దీని కారణంగా చాలా క్రిములు, ధూళి టాయ్ లెట్ సీటుపై పేరుకుపోతాయి. 


తరచుగా మూత్ర విసర్జన తర్వాత, కొన్ని చుక్కలు టాయిలెట్ సీటుపై పడటం మీరు చూసి ఉంటారు. ఆ తర్వాత అక్కడ పసుపు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ టాయిలెట్ సీటును శుభ్రం చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, మనం వారానికి ఒకసారి ఈ టాయ్ లెట్ మొండి మరకలను శుభ్రం చేయాలని చూస్తే, ఆ మరకలు వదలవు.  మార్కెట్లో దొరికే ఘాటు వాసనతో కూడిన లిక్విడ్స్ వాడినా కూడా ఆ మరకలు పోవు. అయితే, మనం వంట గదిలో లభించే కొన్నింటిని వాడి, టాయ్ లెట్ ని శుభ్రం చేస్తే, ఎలాంటి మరకలు అయినా వదిలిపోతాయి. మరి, అదేంటో చూద్దామా...

టాయిలెట్ సీటు మరకలను తొలగించే చిట్కాలు

అవసరమైన పదార్థాలు
యారోరూట్ పౌడర్
తెలుపు వెనిగర్
నిమ్మ తొక్క పౌడర్

దీని కోసం మీరు ఒక పాత్రలో యారోరూట్ పౌడర్( మార్కెట్లో సులభంగా దొరుకుతుంది)  తీసుకోవాలి.
దీనిలో, మీరు తెల్ల వెనిగర్ కలపాలి.
ఇప్పుడు నిమ్మ తొక్కలను మిక్సర్ జార్‌లో వేసి పొడి చేయాలి. దీనిని నీటిలో కూడా కలపవచ్చు. ఆ లిక్విడ్ ని  మీరు టాయ్ లెట్ సీటుపై ఉన్న పసుపు మరకలపై వేసి బాగా రుద్దాలి. కాసేపు అలానే వదిలేయాలి.  15 నిమిషాల తర్వాత  టాయ్ లెట్ బ్రష్ సహాయంతో రుద్దితే సరిపోతుంది. తర్వాత నీటితో కడిగితే ఎలాంటి మరకలు అయినా తొలగిపోతాయి. బాత్రూమ్ టాయ్ లెట్ కొత్త దానిలా కనపడుతుంది. మీ బాత్రూమ్ పరిశుభ్రంగా కూడా ఉంటుంది. దానిని శుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కళ్లు చెదిరే డిజైన్లలో వెండి పట్టీలు
ఒక స్పూను శెనగపిండితో మచ్చల్లేని ముఖం