Health tips: ఈ 5 జపనీస్ అలవాట్లతో.. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం!

Published : Jun 02, 2025, 05:55 PM IST
healthy food

సారాంశం

ఆరోగ్యంగా బ్రతకాలని ఎవరు కోరుకోరు చెప్పండి? కానీ గజిబిజి లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ 5 జపనీస్ అలవాట్లతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చట. అవేంటో తెలుసుకుందామా మరి.

ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే మనుషులు ఎక్కడున్నారంటే ముందుగా గుర్తొచ్చే పేరు జపాన్‌. ఇతర దేశాల్లో 60 ఏళ్లు ఆరోగ్యంగా బ్రతకడమే కష్టంగా ఉంటే.. జపాన్ లో మాత్రం వందేళ్లు హాయిగా జీవిస్తున్నారు. ఇందుకు కారణం.. వారు పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లే. మనం కూడా జపాన్ విధానాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఆహారమే ఔషధం

పోషకాలతో నిండిన ఆహారం.. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. జపనీస్ భోజనంలో బియ్యం, సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, సోయా ఉత్పత్తులు, చేపలు, పులియబెట్టిన ఆహారాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతగానో తోడ్పడుతాయి.

హర హచి బు సూత్రం 

హర హచి బు అంటే తక్కువ తినండి, ఎక్కువ కాలం జీవించండని అర్థమట. జపాన్‌ ఆహార విధానంలో హర హచి బు సూత్రాన్ని విస్తృతంగా అనుసరిస్తారు. అంటే వీరు కుడుపు నిండా కాకుండా 80 శాతం వరకే తింటారట. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి అలవాట్లను పాటించడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. 

జీవన విధానం

జపాన్‌లో వ్యాయామం కేవలం జిమ్‌లకే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ దేశ ప్రజలు పని, ఇతర ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు నడిచి లేదా సైకిల్‌ మీద వెళ్తారట. తప్పనిసరి అయితే ప్రజా రవాణా ఉపయోగించుకుంటారట. నడక, సైక్లింగ్ వారి జీవితాల్లో భాగం అయిపోయిందట. ఇది వారి గుండె ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి బాగా ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఇకిగాయ్ సూత్రం

జపాన్ లో ఆరోగ్యకరమైన జీవనానికి ప్రధాన కారణం ఇకిగాయ్ భావన. అంటే జీవించడానికి ఒక కారణం. ఒక వ్యక్తికి సంతోషం, సార్థకతను అందించే ఒక ముఖ్యమైన భావన ఇకిగాయ్. ఇది ప్రజలకు ఉద్ధేశం, ఆనందంతో నిండిన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. 

ఆచారాలు

జపాన్ దేశంలో ప్రజలు ఎక్కువగా టీ వేడుకలు, షిన్రిన్-యోకు (అడవీ స్నానం) వంటి మానసిక ప్రశాంతతను ప్రోత్సహించే ఆచారాలను పాటిస్తారట. ఈ పద్ధతుల వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. తోటివారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈ కూరగాయలు తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?