Walking: రోజుకు 10వేల అడుగులు.. 21 రోజులు నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Jun 02, 2025, 02:01 PM IST
walking

సారాంశం

వాకింగ్ ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తుంటారు. కానీ 21 రోజులపాటు.. ప్రతిరోజూ 10వేల అడుగులు నడిస్తే.. ఏమవుతుందో మీకు తెలుసా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.      

వాకింగ్.. ఎవ్వరైనా చేయదగ్గ సులువైన వ్యాయామం. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు ఎప్పుడు వీలైతే అప్పుడు కాసేపు నడుస్తూ ఉంటారు. నడక వల్ల బరువు తగ్గడమే కాకుండా మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు. అయితే వాకింగ్ ఎన్ని అడుగులు నడిస్తే మంచిది. ఎలా నడిస్తే మంచిదనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం. 

రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిది?     

ఒక వ్యక్తి రోజుకు ఇన్ని అడుగులు నడవాలని నిర్దిష్ట సంఖ్య లేనప్పటికీ.. శారీరక శ్రమకు 10,000 అడుగులు అనువైన సంఖ్య అని నిపుణులు చెబుతున్నారు. 21 రోజుల పాటు ప్రతిరోజూ 10వేల అడుగులు నడవడం వల్ల బరువు తగ్గడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. క్రమం తప్పకుండా నడవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుందట. కేలరీలను బర్న్ చేయడానికి వాకింగ్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వాకింగ్ గుండె ఆరోగ్యానికి, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు. 

బరువు నియంత్రణ

వాకింగ్ బరువు నియంత్రణకు సహాయపడుతుందని మనకు తెలుసు. అయితే 21 రోజుల పాటు క్రమం తప్పకుండా 10వేల అడుగులు నడిస్తే… 2 నుంచి 3 కేజీల బరువు ఈజీగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

రక్తపోటు నియంత్రణకు..

నిపుణుల ప్రకారం ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. నడక జీర్ణక్రియను సులభతరం చేయడంతోపాటు.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్, ఊబకాయం వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

నడక ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. 21 రోజులు నడవడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నడకతో పాటు మంచి ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

వేగంగా నడవాలి

10 వేల అడుగుల నడక అంటే ఎక్కువ సమయం, వేగం అవసరం. అయితే ఎక్కువ నడవాలనే ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురికాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నడుస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు చురుగ్గా, మరికొన్ని నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిదని చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం
Colon Cancer: 30 ఏళ్ల త‌ర్వాత ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయా.? క్యాన్స‌ర్ కావొచ్చు