రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష లేకుండా ఎంపిక.. వెంటనే అప్లయి చేసుకోండీ..

By asianet news teluguFirst Published May 21, 2021, 4:50 PM IST
Highlights

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పదో తరగతి తరువాత ఐ‌టి‌ఐ చేసిన వారికి అద్భుతమైన ఉద్యోగ అవకాశం. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌ 24 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం  https://www.rrc-wr.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Latest Videos

మొత్తం ఖాళీలు: 3591

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఊన్నాయి.

విద్యార్హత: మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 4 జూన్‌  2021 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

also read హైదరాబాద్ ఎన్‌ఎం‌డి‌సిలో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక.. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...

ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్‌సి, ఎస్‌టి, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు. మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 25 మే 2021

దరఖాస్తులకు చివరితేది: 24 జూన్‌ 2021

అధికారిక వెబ్‌సైట్‌: https://www.rrc-wr.com/

click me!