SSC CGL 2019: 'కేంద్ర ఉద్యోగాలు'...ఇంటర్ అర్హత ఉంటే చాలు...

By Sandra Ashok Kumar  |  First Published Dec 6, 2019, 12:27 PM IST

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2019కు సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 10న దరఖాస్తు చివరి తేదీ.


కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్), టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షలు నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక జరుగుతుంది.


ఉండాల్సిన అర్హత :ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓపెన్ స్కూల్, దూరవిద్య చదివిన వారు దరఖాస్తుకు అనర్హులు.

Latest Videos

undefined

వయోపరిమితి: అభ్యర్థులు 01.01.2020 నాటికి 18-27 సంవత్సరాల మధ్య వయస్సువారై ఉండాలి. 02.01.1993 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము : అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

also read LICలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం: టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్), టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

'టైర్-1' పరీక్ష విధానం, మార్కులు

మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు. పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కులు విధిస్తారు.

also read రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు...ఐటీఐ అర్హత ఉంటే చాలు


'టైర్-2' పరీక్ష విధానం, మార్కులు

టైర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు.100 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. రాత  పరీక్ష విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్షలో భాగంగా 200-250 పదాలతో వ్యాసం (ఎస్సే), 150-200 పదాలతో లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 20 నిమిషాల అదనపు సమయన్ని కేటాయిస్తారు. కనీస అర్హత మార్కులు 33గా నిర్ణయించారు.


'టైర్-3' పరీక్ష విధానం, మార్కులు

టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-3 (స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కంప్యూటర్‌లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ వేర్వేరుగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2020 (23:59)
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2020 (23:59)
ఆఫ్‌‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 12.01.2020 (23:59)
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.01.2020
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (టైర్-1): 16.03.2020 - 27.03.2020
టైర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్ పేపర్): 28.06.2020

click me!