చిన్నారిపై రేప్, హత్య: దోషీకి ఉరిశిక్ష అమలు

By narsimha lodeFirst Published Oct 17, 2018, 10:14 AM IST
Highlights

ఏడేళ్ల చిన్నారిపై  అత్యాచారం చేసిన కేసులో నిందితుడు  ఇమ్రాన్ అలీకి పాకిస్తాన్‌లోని   లక్‌పతి సెంట్రల్ జైల్‌లో బుధవారం నాడు  ఉదయం ఉరిశిక్ష విధించారు.

లాహోర్:  ఏడేళ్ల చిన్నారిపై  అత్యాచారం చేసిన కేసులో నిందితుడు  ఇమ్రాన్ అలీకి పాకిస్తాన్‌లోని   లక్‌పతి సెంట్రల్ జైల్‌లో బుధవారం నాడు  ఉదయం ఉరిశిక్ష విధించారు.

ఏడేళ్ల చిన్నారి తల్లి దండ్రుల సమక్షంలో బుధవారం నాడు  ఉదయం పూట జైలు ఆవరణలో  నిందితుడిని ఉరి  తీశారు. యాంటీ టెర్రరిజం కోర్టు జడ్జి సజ్జాద్ అహ్మద్ శుక్రవారం నాడు  ఇమ్రాన్ అలీకి బ్లాక్ వారంట్ జారీ చేశారు.  కొంత కాలం క్రితం  ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ఇమ్రాన్ నిందితుడు.

తన కూతురికి జరిగిన అన్యాయానికి  నిందితుడిని ఉరి తీయడం ద్వారా  తనకు న్యాయం జరిగిందని మృతురాలి  తండ్రి అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ అలీ ఉరి శిక్ష తర్వాత  బుధవారం నాడు ఆయన జైలు వద్ద కోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు.

ఉరిశిక్షకు ముందు  ఇమ్రాన్ అలీ కుటుంబసభ్యులు, ఇద్దరు స్నేహితులతో  సుమారు 45 నిమిషాలు గడిపాడు. ఇదిలా ఉంటే  నిందితుడిని  బహిరంగంగా ఉరితీయాలని  చిన్నారి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు మంగళవారం నాడు కొట్టివేసిన విషయం తెలిసిందే.

click me!