కరోనా రోగులపై హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ ప్రయోగాల నిలిపివేత: డబ్ల్యుహెచ్ఓ

By narsimha lodeFirst Published Jul 5, 2020, 6:12 PM IST
Highlights

 కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 
 

జెనీవా: కరోనా చికిత్సకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

హైడ్రాక్సీక్లోరోక్విన్ తో పాటు హెచ్ఐవీ మందులు లోపినావిర్-రిటోనావిర్ తో చేస్తున్న ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. 

కరోనా రోగులపై ఈ ఔషధాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయో కొంత కాలంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఇటీవల వచ్చాయి.  ఆయా ఔషధాల ప్రభావం అంతి తక్కువగా ఉన్నట్టుగా డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. దీంతో ఈ మందులను కరోనా రోగులపై ప్రయోగించడం మానివేయాలని సూచించింది.

ఈ మందులు కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో అతి తక్కువ ఫలితాలను చూపిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. తాను కూడ హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకొన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఈ మందు వేసుకొన్న తర్వాత తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.

కరోనా నివారణకు గాను వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇండియాకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మనుషులపై కోవాక్సిన్  ప్రయోగాలు ప్రారంభించనుంది. దేశంలోని 12 సెంటర్లలో మనుషులపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.
 

click me!