కరోనా వైరస్ (Coronavirus) కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ప్రపపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రమాదకరమైన వేరియంట్ల కంటే తాజాగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరింత ప్రమాదకరమైనది ప్రకటించటంతో యావత్ ప్రపంచం అప్రమత్తమైంది. డబ్ల్యూహెచ్‌వో సైతం (WHO) రంగంలోకి దిగింది.
ఇప్పటివే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న కరోనా మహమ్మారి.. మార్పులు చెందుతూ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైనదనీ, దీని వ్యాప్తి సైతం అధికంగా ఉంటుందని నిపుణుల అంచనాల నేపథ్యంలో కలవరం మొదలైంది. సాధారణ కోవిడ్ కేసుల కంటే రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ నిపుణుల బృందాన్ని దక్షిణాఫ్రికాకు పంపించింది. అక్కడ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, ఈ వేరియంట్ వ్యాప్తి, చూపుతున్న ప్రభావం, కట్టడి చర్యలపై ఈ బృందం పరిశోధించనుందని ఓ అధికారి వెల్లడించారు.
Also Read: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
undefined
మొదటగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం ఈ రకం కేసులు రోజురోజుకూ రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. రోజువారీ గణాంకాలు గమనిస్తే.. తాజాగా 11,500 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 8,500 కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే రెట్టింపు కేసులు నమోదుకావడంపై అక్కడి అధికార యంత్రాంగంతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, దక్షిణాఫ్రికాలో నవంబర్ నెల మధ్యలో రోజువారీ సగటు కేసులు 200 నుంచి 300 వరకు నమోదయ్యేవని అధికారులు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దక్షిణాప్రికా సహా 24కు పైగా దేశాల్లో Omicron వేరియంట్‌ను WHO గుర్తించింది. దక్షిణాఫ్రికా ఆర్థిక కేంద్రంగా ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్ లో గత వారంలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల 80 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌ఐసీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కొత్త వేరియంట్‌కు చెందినవే ఉంటున్నాయి.
Also Read: ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్రతిష్ట !
ఇక గతవారం రోజులుగా ఆఫ్రికా ఖండంలో కరోనా కొత్త కేసులు గణనీయంగా పెరిగాయని ఆఫ్రికా రీజియన్ WHO డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మొయిటీ అన్నారు. డేవిడ్ మఖురా మీడియాతో మాట్లాడుతూ.. గరిష్ట స్థాయిలో మరోవేవ్ వచ్చే అవకాశాలున్నాయని అంచనావేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. తమ క్లినికల్ బృందాలు సైతం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. మరో కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ అధిక మొత్తంతో ప్రజలను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు. అయితే, మరణాలు మాత్రం తక్కువగానే నమోదవుతాయని అంచనా వేశారు. ఈ వేరియంట్ అధికా స్థాయి కమ్యూనిటీ వ్యాప్తి జనవరి వరకు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు.
Also Read: పెరిగిన ప్రజా ఫిర్యాదులు.. పార్లమెంట్ నాల్గో రోజు అంశాలివిగో !
ఇదిలావుండగా, దక్షిణాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్‌తో ఎలాంటి సంబంధంలేని.. అదే తరహా కరోనా వైరస్ జాతికి చెందిన మొదటి కేసును స్పానిష్ ఆరోగ్య అధికారులు గుర్తించారు. అక్కడ మొత్తం ఐదు ఒమిక్రాన్ కేసులు గుర్తించబడగా, దక్షిణాఫ్రికా ప్రయాణం చేయాని, అక్కడివారితో సంబంధంలేని వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ గురించి పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఉన్నఅందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అంతర్జాతీయంగా ఒమిక్రాన్ తో ప్రమాదమెక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిపిందే. ఇక ఒమిక్రాన్ పై టీకాలు సైతం పనిచేయకపోవచ్చుననే అంచనాల నేపథ్యంలో ఇప్పటికే ఈ రకం కేసులు నమోదైన దేశాలతో పాటు.. ఇతర దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు