గతేడాది చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. రోజురోజుకూ తనలో కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ.. యమ డేంజర్‌గా మారుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కొత్త వేరియంట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి (coronavirus) తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికే అన్ని దేశాలకు వ్యాపించిన కోవిడ్-19.. అనేక మార్పులు చెందుతూ మరింత ప్రమాదకరంగా మారుతున్నది. మరీ ముఖ్యంగా భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌కు కారణమైన డెల్టా, డెల్టా ప్లప్ వేరియంట్లు అత్యంత ప్రమాదకరమైనవిగా ఇప్పటివరకు పరిగణించారు. అయితే, గతనెల దక్షిణాఫ్రికాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (OMICRAN VARIANT) గుర్తించారు. దీనిని గుర్తించిన వారంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలలో అతిప్రమాదకరమైన వేరియంట్‌గా ఒమిక్రాన్‌ను ప్రకటించింది. ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ కీలక సూచనలు సైతం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. అలాగే, పేద దేశాలకు టీకాలు అందించడంలో ధనిక దేశాలు ముందుకు రావాలని పేర్కొంది.
దీనికి తోడు దక్షిణాఫ్రికా (South Africa) దేశ శాస్త్రవేత్తలతో పాటు అంతర్జాతీయ పరిశోధకులు సైతం ఒమిక్రాన్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఒమిక్రాన్ అడ్డుకోలేవని పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్ అధికమొత్తంలో స్పైక్ మ్యుటేషన్లను కలిగివుండటమేనిని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు సైతం దీనిపై సమర్థవంతంగా పనిచేయకపోవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి పూర్తిగా రాకపోకలను నిషేధించాయి. ప్రస్తుతం రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసును ఇచ్చే అంశాన్ని సైతం ఆయా దేశాల ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.
అయితే, ఇటీవలే అమెరికాలో (omicron america) రెండు డోసులు తీసుకోవడంతో పాటు బూస్టర్ డోసు సైతం తీసుకున్న ఓ వ్యక్తం ఒమిక్రాన్ వేరియంట్ సోకడం యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియన్ వేగవంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ గురించి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు (scientists in South Africa) మరిన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఆయా అంశాలను గమనిస్తే ఒమిక్రాన్ యమడెంజర్ అని అర్థమవుతోంది. Omicronపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికల ప్రకారం.. కరోనావైరస్ (COVID-19) కొత్త వేరియెంట్ ప్రభావాన్ని గుర్తించడం చాలా కష్టం . మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాధికారక క్రిములతో పోరాడగలుగుతుందనీ, ధృఢమైన రక్షణ వ్యవస్థ కలిగిన యువకులను సైతం ప్రభావితం చేస్తుందని హెచ్చిరిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలు ఒమిక్రాన్ వ్యాపించిందని తెలిపారు. ఒమిక్రాన్ మొదటగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో గత 24 గంటల్లో రెట్టింపు స్థాయికి పెరిగాయనీ, ఇతర పలు దేశాల్లో వైరస్ విజృంభణను పరిగణలోకి తీసుకుని అన్ని దేశాలు కోవిడ్ మార్గదర్శకాను పక్కగా అమలు చేయాని నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక భారత్ సైతం ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.