కరోనా చికిత్స: శాస్త్రవేత్తల కృషి.. అందుబాటులోకి టాబ్లెట్, యూకే సర్కార్ ఆమోదం

By Siva KodatiFirst Published Nov 4, 2021, 6:40 PM IST
Highlights

కరోనా చికిత్సా విధానంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. వైరస్‌పై పోరాటానికి మెర్క్ (Merck ) , రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌ (Ridgeback Biotherapeutics) సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ మాత్రను బ్రిటన్ ప్రభుత్వం గురువారం ఆమోదించింది.

కోవిడ్ (coronavirus) మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ (covid vaccine) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిని మరింత కంట్రోల్ చేసేందుకు గాను ఇంజెక్షన్లు, టాబ్లెట్ల రూపంలో (covid tablets) మందులను తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సా విధానంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. వైరస్‌పై పోరాటానికి మెర్క్ (Merck ) , రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌ (Ridgeback Biotherapeutics) సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ మాత్రను బ్రిటన్ ప్రభుత్వం గురువారం ఆమోదించింది. 

దీంతో ఈ తరహా చికిత్సకు అనుమతించిన తొలి దేశంగా యూకే నిలిచింది. కొవిడ్‌ చికిత్సకు ఆమోదం పొందిన మొదటి ఓరల్‌ యాంటీవైరల్ చికిత్స ఇదే కావడం విశేషం. కరోనా పాజిటివ్‌గా తేలితే.. వీలైనంత త్వరగా లేదా లక్షణాలు కనిపించిన అయిదు రోజుల్లోపు మోల్నుపిరవిర్ టాబ్లెట్లను వాడాలని ఇక్కడి మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (Medicines and Healthcare products Regulatory Agency ) (ఎన్‌హెచ్‌ఆర్‌ఏ) సిఫార్సు చేసింది. బ్రిటన్‌లో మోల్నుపిరవిర్‌ను ‘లగేవ్రియో’ అనే బ్రాండ్‌తో రూపొందించారు.  

ALso Read:ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల కోవిడ్ మరణాలు.. యూరోప్ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ఇక కోవిడ్ చికిత్సలో మోల్నుపిరవిర్‌ను (molnupiravir ) వినియోగించాలా వద్దా అనే అంశంపై అమెరికా మెడిసిన్‌ రెగ్యులేటరీ నిపుణులు ఈ నెలలో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోల్నుపిరవిర్‌కు బ్రిటన్‌ ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైరస్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చికిత్స ప్రారంభిస్తే.. రోగి ఆసుపత్రి పాలవ్వడం, మరణించే అవకాశాలను సగానికి తగ్గించవచ్చని ట్రయల్స్‌లో తేలింది. మరోవైపు బ్రిటన్‌ ప్రభుత్వం.. మోల్నుపిరవిర్‌ను వినియోగించే విధానంపై త్వరలోనే మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇప్పటికే 4.80 లక్షల మాత్రల కోసం ‘మెర్క్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి నాటికి కోటి మాత్రలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు మెర్క్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

click me!