పాపం అమెరికా.. అరబ్ లీగ్‌లోకి సిరియా ఆగమనం.. అగ్ర దేశం మరింత దిగజారక తప్పదా?

By Asianet NewsFirst Published May 29, 2023, 5:57 PM IST
Highlights

ఉప్పు నిప్పుగా ఉన్న సిరియా, అరబ్ లీగ్ దేశాలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. ఇటీవల జెడ్డాలో నిర్వహించిన అరబ్ లీగ్‌కు సిరియా అధ్యక్షుడు అసద్ ఘన స్వాగతంతో హాజరయ్యారు. అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా అరబ్ సహాయంతో ప్రాక్సీ వార్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్ వెనుక అమెరికా హస్తమే ఉన్నదని చెబుతారు. అసద్ హాజరైన అరబ్ లీగ్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరవడం ఒక వైచిత్రి.
 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమైర్ జెలెన్‌స్కీ అరబ్ లీగ్ సదస్సుకు హాజరు కావడం.. అదే సదస్సులో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రత్యక్షం కావడం.. చాలా మందిని ఆశ్చర్యచకితులను చేసి ఉండొచ్చు. ఇదొక వైచిత్రి. అరబ్ నేతలు సాధారణంగా అమెరికా ఆధిపత్యానికి లోబడి ఉంటారు. కానీ, ఇప్పుడు వారొక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం.. అమెరికా క్షీణతను రూఢీ చేస్తున్నది. ఈ మార్పుతో సిరియా లబ్ది పొందనుంది.

అఫ్ఘనిస్తాన్‌ను అక్రమించిన 20 ఏళ్లకు, ఇరాక్‌ను అధీనంలోకి తెచ్చుకుని 10 ఏళ్లు గడుస్తున్న సందర్భంలో అమెరికా ఒక దారుణ విధానాన్ని అమలు చేసింది. సిరియాలో అధికారాన్ని మార్చవచ్చునని అమెరికా ఒక కల కన్నది. అరబ్ దేశాల సహాయంతో సరిహద్దు గుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఈ పని చేయాలని అనుకుంది. దీనికే మరో పేరు ప్రాక్సీ వార్.

ఇప్పుడు ఉక్రెయిన్ ధ్వంసమైపోతున్నట్టే.. సిరియాలోని పురాతన, చారిత్రక ప్రాంతాలు, కట్టడాలు నాశనమైపోయాయి. ప్రభుత్వాలను అస్థిరపరచడంలో వెస్ట్రన్ ఫెయిల్యూర్ చాలా సార్లు స్పష్టమైంది. ఉదాహరణకు సిరియాలోని బషిర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అమెరికా వేసిన ఎత్తులు ఎలా విఫలమయ్యాయో చూస్తే చాలు. జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ను ఫారీన్ రిలేషన్స్ కమిటీ 500 మిలియన్ డాలర్ల ప్రాజెక్టు గురించి వేసిన ప్రశ్నలు ఈ వైఫల్యాన్ని స్పష్టం చేస్తాయి. ఆ ప్రాజెక్టు కొందరికి మిలిటెంట్లుగా శిక్షణ ఇచ్చి అసద్ బలగాలపైకి తీసుకెళ్లాలి. కానీ, ప్రాజెక్టు ఫలితం మాత్రం ఒక విషాదభరిత హాస్యంగా మిగిలిపోయింది.

కఠిన శిక్షణ, విలువైన ఆయుధాలు పొందిన తర్వాత ఆ సోల్జర్లు ఆ ఆయుధాలు, పేలుడు పదార్థాలతో మాయమయ్యేవారు. శిక్షణకు వస్తున్న మోసకారులైన సోల్జర్లను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ట్రాక్ చేశాయి. ఆ ట్రైనింగ్ ఇంచార్జీ ఆఫీసర్ జనరల్ ఆస్టిన్ ఇప్పుడు అమెరికా రక్షణ మంత్రి.

ఆ సెనేట్ ప్రశ్నలు వేయగా.. ఆస్టిన్ సమాధానాలు చెప్పాడు. మనం శిక్షణ ఇచ్చిన మిలిటెంట్లలో ఎంతమంది మన కోసం ఫైట్ చేస్తున్నారు? అని ప్రశ్నించగా.. ఆస్టిన్ ఖంగుతిన్నాడు. దీర్ఘ శ్వాస తీసుకుని నలుగురు లేదా ఐదుగురు ఉండి ఉంటారు అని చెప్పాడు. ఒబామా డిఫెన్స్ సెక్రెటరీ ఆష్టన్ కార్టర్ దాదాపు కెమెరాల ముందే ఏడ్చినంత పని చేశాడు.

జెలెన్‌స్కీ ఒక నైతిక విషయాన్ని అవగాహన చేసుకోవాల్సింది. బలమైన పునాదులు గల ప్రభుత్వాన్ని ప్రాక్సీ వార్‌లతో కూల్చేయలేమని, అసద్ కంటే వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రెట్లు శక్తిమంతుడని అర్థం చేసుకోవాలి. 

‘వ్లాదిర్ పుతిన్‌ను ప్రాక్సీ వార్‌లు గద్దె దింపలేవు.’

మరొక విషయం కూడా ఉక్రెయిన్ అర్థం చేసుకోవాలి. అరబ్ ప్రపంచంలో మారిన స్వరాలను గుర్తించాలి. జెడ్డాలో జరిగిన అరబ్ లీగ్ కోసం అసద్ ఎంట్రీ ఏదో సాదా సీదాగా జరగలేదు. సిరియన్ జెండాలు దారి పొడుగునా ఎగిరాయి. రాజ కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ తెలివిగా.. అసద్‌ను పదవీచ్యూతిడిని చేయడం విఫలైమందని గ్రహించాడు. ఆ ప్రాక్సీ వార్‌లో 2015లోనే రష్యా జోక్యం అక్కడి గతిని మార్చివేసింది.

సిరియాలో రష్యా జోక్యం కీలక ఘట్టం. అది 1999లో నాటో ప్రిస్టిన్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంతో పోల్చవచ్చు. ఆ ఎయిర్‌పోర్టులో ఘర్షణ నివారించబడటమే కాదు.. రష్యా, నాటోలు 1999 నుంచి కలిసి పంచుకున్న అరుదైన వేదికగా అది నిలిచింది.

ఆ ఎయిర్‌పోర్టులో పరిస్థితులను తలకిందులు చేయాలని నాటో కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ అనుకున్నాడు. కానీ, ఆయన డిప్యూటీ, బ్రిటిష్ కాంటింజెంట్ మైక్ జాక్సన్ ఆయనను వ్యతిరేకించారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అనుకోవడం లేదని చెప్పేశాడు. కానీ, క్లార్క్‌లో మాత్రం కట్టడి చేయలేని ఆగ్రహం ఉండింది. అది బహుశా ఏకైక సూపర్ పవర్ ఉండాలనే మైండ్‌సెట్ వల్ల కావచ్చు.

జెలెన్‌స్కీ ప్రతిఘటనాపరమైన చర్యల్లో సెర్బ్‌లు,, రష్యన్లకు మధ్య గల సౌథర్న్ స్లావిక్ ఎత్నిక్ లింకులు, ఆర్థడాక్స్ చర్చిలతో సంబంధాలు కారణాలుగా ఉన్నాయి. ఉదాహరణకు కీవ్‌లోని శతాబ్దాల పూర్వమైన చర్చిలో నుంచి ఆర్థడాక్స్ ప్రీస్టులను వదిలి వెళ్లాలని జెలెన్‌స్కీ ఆదేశించారు. ఇక్కడి పురోహితులు, భక్తులతో మాస్కోలని చర్చులతో సంబంధాలున్నాయని తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయం. 

Also Read: స్వతంత్ర భారతంలో దళిత ముస్లింలకు ఆరు నెలలే రిజర్వేషన్లు లభించాయి. ఎందుకు?

అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే జెలెన్‌స్కీ నడుచుకుంటున్నాడని అంటారు. జెలెన్‌స్కీ ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ బయటకు వ్యాపింపజేయాలని అనుకుంటున్నాడా? ముఖ్యంగా బాల్కన్‌లకూ విస్తరించాలని భావిస్తున్నాడా? అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆ దేశంలోని అంతర్గత సమస్యలతోనే సతమతం అవుతున్నాడు. ఉక్రెయిన్ పై ఏకాగ్రత పెట్టే తీరిక లేదని అనిపిస్తున్నది. 

కాబట్టి, జెలెన్‌స్కీ తెలుసుకోవాల్సిందేమిటంటే.. అరబ్ ప్రపంచం మొత్తం అమెరికా శిబిరం నుంచి బయటకు నడిచాయి. భవిష్యత్‌లో అమెరికా ప్రాబల్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అరబ్, ఆఫ్రికన్లు, లాటిన్ అమెరికన్లు, దక్షిణాసియాలోనూ బహుళ పక్ష ప్రపంచం కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సౌది, ఇరాన్‌ల మధ్య చిగురించిన స్నేహం, సిరియా మళ్లీ అరబ్ లీగ్‌కు మళ్లడం వంటివి ఈ అవకాశా లను బలో పేతం చేస్తు న్నాయి.

 

---సయీద్ నఖ్వి

click me!