‘‘సెక్స్ టాయ్’’ ని చూసి బాంబ్ అనుకున్నారు

First Published Aug 9, 2018, 3:22 PM IST
Highlights

కొద్ది సేపటి తర్వాత బాంబ్ స్క్వాడ్ వచ్చి దానిని తనిఖీ చేయగా.. అది బాంబ్ కాదని సెక్స్ టాయ్ అని తేలింది. దీంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సెక్స్ టాయ్ ని చూసి ఏదో ప్రమాదకర వస్తువు( బాంబు) అనుకొని విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసివేసిన సంఘటన జర్మన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విమానాల్లోకి గన్స్, కత్తులు, చాకులు లాంటి పదునైన వస్తువులు, బాంబులు లాంటి ప్రమాదకరమైన వస్తువులను అనుమతించరన్న విషయం తెలిసిందే.

అందుకే.. ఎయిర్ పోర్టులో మనం తీసుకువెళ్తున్న లగేజ్ బ్యాగులను స్కాన్ చేస్తుంటారు. ఆ స్కానింగ్ లో  ఏదైనా తేడాగా కనిపిస్తే.. దానిని మళ్లీ  చెక్ చేస్తారు. ఇలాంటి సంఘటనే జర్మన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి తన హ్యాండ్ లగేజ్ లో సెక్స్ టాయ్ ని ఉంచాడు. డిజిటల్ స్కానింగ్ లో అది ఏదో ప్రమాదకర వస్తువులాగా కనపడింది. అంతే ఇంకేముంది.. బ్యాగ్ ని పక్కన పెట్టి.. అందులో బాంబు ఉందని ఎనౌన్స్ చేసి ఎయిర్ పోర్టుని ఖాళీ చేయించారు.

కొద్ది సేపటి తర్వాత బాంబ్ స్క్వాడ్ వచ్చి దానిని తనిఖీ చేయగా.. అది బాంబ్ కాదని సెక్స్ టాయ్ అని తేలింది. దీంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

click me!