
ఫిలడెల్ఫియాలో సోమవారం కాల్పులు ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ సాయుధుడు కింగ్‌సెసింగ్ విభాగంలో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఇందులో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయాలతో భయటపడ్డారు.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన (వీడియో)
కాగా ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ తెలిపింది. ఈ ఘటనపై ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి ఒకరు ‘రాయిటర్స్’ కు ఈమెయిల్ పంపించారు. ఈ కాల్పుల ఘటనలో అనేక మంది తుపాకీ బాధితులు ఉన్నారని ధృవీకరించారు, అయితే మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
విమానంలో కూతురిని అనుచితంగా తాకాడని తోటి ప్రయాణికుడిపై తండ్రి ఆగ్రహం.. వీడియో వైరల్
ఆదివారం అమెరికాలోని బాల్టిమోర్, కాన్సాస్ నగరాల్లో జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో.. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఉదయం సమయంలో బాల్టిమోర్ లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడగా ఇద్దరు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.
కాన్సాస్ లో ని ఉత్తర వాషింగ్టన్ వీధిలోని సిటీ నైట్స్ నైట్ క్లబ్ లో కూడా శనివారం రాత్రి ఒంటిగంటకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. కాల్పుల విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.