పాకిస్తాన్ లో పరువు హత్యలు.. ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి...

Published : Jul 04, 2023, 06:41 AM IST
పాకిస్తాన్ లో పరువు హత్యలు.. ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి...

సారాంశం

సయీద్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్ల మీద కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు.

పాకిస్తాన్ : పాకిస్తాన్ లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. వారం వ్యవధిలో రెండు పరువు హత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ తండ్రి తన ఇద్దరు కూతుర్లను గన్ తో కాల్చి చంపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఒక తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపిన ఘటన పాకిస్తాన్, పంజాబ్‌లోని కసూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఇవి పరువు హత్యలు అని స్థానిక మీడియా నివేదించింది.

సయీద్ అనే వ్యక్తి హవేలీ నథోవాలి ప్రాంతంలో పరువు కోసం తన ఇద్దరు కుమార్తెలపై కాల్పులు జరిపాడు. దీంతో బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తరువాత అక్కడినుంచి తండ్రి పారిపోయాడు. సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దారుణం.. బ్రేకప్ చెప్పిందని 15 ఏళ్ల మాజీ ప్రేయసిని చంపిన 16 ఏళ్ల బాలుడు.. బర్త్ డేకు ఐదు రోజుల ముందు ఘటన

ఇక, ఈ వారం ప్రారంభంలో, పరువు పేరుతో 12 ఏళ్ల బాలుడు తన తల్లిని చంపిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన పాకిస్తాన్ లోని గుజ్రాన్‌వాలా శాటిలైట్ టౌన్ పరిసరాల్లో జరిగిందని తెలుస్తోంది. ఏఆర్వై న్యూస్ ప్రకారం, మృతురాలు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా, బాలుడు ఆమెపై కాల్పులు జరిపాడని, అతని అత్తగా గుర్తించబడిన మరో మహిళకు గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలుడు హత్యను అంగీకరించాడు. తరువాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే