కాబూల్‌లో మహిళా బ్యూటీ సెలూన్‌లపై నిషేధం విధించిన తాలిబాన్..

Published : Jul 04, 2023, 07:08 AM IST
కాబూల్‌లో మహిళా బ్యూటీ సెలూన్‌లపై నిషేధం విధించిన తాలిబాన్..

సారాంశం

కాబూల్ లో మహిళల బ్యూటీ సెలూన్లను మూసివేస్తూ తాలిబాన్  కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. 

కాబూల్ : తాలిబాన్ కొత్తగా కాబూల్, దేశవ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్‌లను నిషేధించింది. ఈ మేరకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసింది. తాలిబాన్ వైస్ అండ్ వర్చ్యుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ అకిఫ్ మహజర్ అక్కడి స్థానిక మీడియాతో తెలిపారు. తాలిబాన్ నాయకుడు చెప్పిన  కొత్త డిక్రీని అమలులోకి తీసుకురావాలని, మహిళల బ్యూటీ సెలూన్ల లైసెన్స్‌లను రద్దు చేయాలని తాలిబాన్ వైస్, ధర్మ మంత్రిత్వ శాఖ కాబూల్ మునిసిపాలిటీని ఆదేశించింది.

"పురుషులకు ఉద్యోగాలు లేవు. మగవాళ్ళకు ఉద్యోగాలు లేని సమయంలో ఆడవాళ్లు చేసే పనివల్లే కుటుంబం గడుస్తుంది. అక్కడ కూడా వారిమీద నిషేధం విధిస్తే.. మేం ఏమి చేయగలం?" అని ఓ మేకప్ ఆర్టిస్ట్ రైహాన్ ముబారిజ్ అన్నారు. "మగవారికి ఉద్యోగాలు ఉంటే మేము ఇంటి నుండి బయటకే రాము. ఇప్పుడేం చేయాలి? మేము ఆకలితో చనిపోవాలి, మేము చనిపోవాలనే మీరు కోరుకుంటున్నారా?" అని మేకప్ ఆర్టిస్ట్ అన్నారు.

పాకిస్తాన్ లో పరువు హత్యలు.. ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి...

ఇస్లామిక్ ఎమిరేట్ బాలికలు, మహిళలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు,  ఎన్జీఓలలో పని చేయడంతో పాటు పార్కులు, సినిమాస్, ఇతర వినోద ప్రదేశాలు వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లడాన్ని నిషేధించింది. ఈ క్రమంలోనే ఇది జరిగింది. 

కాబూల్ నివాసి అబ్దుల్ ఖబీర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. "ప్రభుత్వం దాని కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలి. ఫ్రేమ్‌వర్క్ ఇస్లాం లేదా దేశానికి హాని కలిగించని విధంగా ఉండాలి" అన్నారు. ఆఫ్ఘన్ బాలికలు, మహిళలపై తాలిబాన్ ఆంక్షలు విధించడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారితీసింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే