అక్కడ పెళ్లి కంటే ముందు శృంగారం నేరం.. కొత్త క్రిమినల్ కోడ్

By Mahesh KFirst Published Dec 2, 2022, 5:56 PM IST
Highlights

ఇండోనేషియాలో పెళ్లి కంటే ముందు సెక్స్ నేరంగా పరిగణించడానికి చట్టబద్ధంగా మార్పులు తెస్తున్నది. ఈ మేరకు ఇండోనేషియా పార్లమెంటు త్వరలో కొత్త క్రిమినల్ కోడ్‌ను పాస్ చేయనున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: ఇండోనేషియాలో పెళ్లి కంటే ముందు శృంగారంలో పాల్గొనడం నేరంగా పరిగణించనుంది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటు త్వరలోనే ఓ క్రిమినల్ కోడ్‌ను పాస్ చేయనున్నట్టు ఆ దేశ మీడియా ఓ కథనం వెలువరించింది. మరికొద్ది రోజుల్లో ఈ డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్‌ను పార్లమెంటు పాస్ చేయనుంది.

‘ఎవరైనా సరే తన భర్త లేదా తన భార్యతో కాకుండా వేరేవారితో సంగమిస్తే దాన్ని నేరంగా పరిగణించి గరిష్టంగా ఒక ఏడాది జైలు శిక్ష పడుతుంది. లేదా కేటరిగీ 2 ప్రకారం గరిష్ట జరిమానాలు ఉంటాయి’ అని ఆ కథనం తెలిపింది. కానీ, అందుకు భార్య లేదా భర్త నుంచి లేదంటే పెళ్లి కాని పిల్లల తల్లిదండ్రుల నుంచి అయినా ఫిర్యాదు అందాల్సి ఉంటుందని, ఫిర్యాదు అందితేనే పోలీసుల యాక్షన్ ఉంటుందని ఆ రెగ్యులేషన్ వివరిస్తున్నది. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు వరకు ఈ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవచ్చని మరో నిబంధన తెలుపుతున్నది.

Also Read: పెళ్లికి ముందే సెక్స్... తప్పు చేశామని అమ్మాయిలు..!

ఈ డ్రాఫ్ట్ కోడ్‌ను మూడు సంవత్సరాల కిందనే అమలు చేయాల్సింది. కానీ, దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ చట్టాలు తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తాయని ప్రజలు నిరసనలు చేశారు. దేశ అధ్యక్షుడు, ప్రభుత్వ సంస్థలు, ఇండోనేషియా ప్రభుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడం, పెళ్లికి ముందు సెక్స్‌పైనా నిషేధం విధింంచింది.

ముస్లిం మెజార్టీ దేశాల్లో అత్యధిక జనాభా గల దేశమైన ఇండోనేషియాలో మహిళలపై వివక్ష ఉన్నది. క్షేత్రస్థాయిలోకి వెళితే మహిళలు, మతపరమైన మైనార్టీలు, ఎల్జీబీటీలపై వివక్ష ఉన్నట్టు తెలుస్తున్నది.

click me!