PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం 'మిత్ర విభూషణ' అవార్డు.. దీని ప్రత్యేకత ఏంటంటే

ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన ‘మిత్ర విభూషణ’ మెడల్‌ను ప్రదానం చేసింది. ఈ అవార్డు భారతదేశం- శ్రీలంక మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను బలపరచడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చారు. ఇంతకీ మెడల్‌లో ఉన్న చిహ్నాల అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

PM Modi Honoured with Sri Lanka Mithra Vibhushana Award Meaning, Symbolism and Significance in telugu VNR

ప్రధాని నరేంద్ర మోదీకి ఇతర దేశాల్లో మంచి గౌరవం లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు పలు అవార్డులను ప్రదానం చేసి మోదీని సత్కరించాయి. తాజాగా ఈ జాబితాలోకి శ్రీలంక వచ్చి చేరింది. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి ఆ దేశం మిత్ర విభూషణ అవార్డును అందించింది. ఇది విదేశాల్లో మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. ఈ అవార్డు భారత్-శ్రీలంక దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.

అవార్డులో ఉన్న ప్రత్యేక చిహ్నాల అర్థం:

Latest Videos

ధర్మ చక్రం – రెండు దేశాల మధ్య ఉన్న బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.

పుణ కలశం – నూతన శుభప్రద ప్రారంభాలను, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.

నవరత్నాలు – శ్రీలంక, భారత్‌ల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని సూచిస్తూ, ఒక లోకగోళం చుట్టూ పద్మదళాలలో అలకరించారు. 

సూర్యుడు, చంద్రుడు – రెండు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని సూచిస్తుంది. 

ఈ గౌరవం ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వానికి, ప్రాంతీయ సహకారం, సాంస్కృతిక పునరుద్ధరణ, ఆధ్యాత్మిక మార్గదర్శనానికి గుర్తింపుగా నిలుస్తోంది. ఇది భారతదేశం శాంతి, సామరస్యంతో పాటు సమూహ అభివృద్ధికి దోహదపడే దేశమని ప్రపంచానికి చాటి చెబుతుంది. 

 

| Colombo | Prime Minister Narendra Modi receives Mithra Vibhushana award from Sri Lankan President Anura Kumara Dissanayake

(Source - ANI/DD) pic.twitter.com/9xvngn9q00

— ANI (@ANI)
vuukle one pixel image
click me!