ఘరానా మోసగాడు.. 75మందిని పెళ్లాడి, 200మందిని వ్యభిచారంలోకి దింపి.. డ్రగ్స్ కు బానిసలుగా చేసి...

By AN TeluguFirst Published Oct 6, 2021, 10:04 AM IST
Highlights

ఉమెన్ ట్రాఫికింగ్ అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయాలు తెలిసి షాక్ కు గురయ్యారు. అతను బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని అక్రమరవాణా చేయడమే కాదు, వారిని బలవంతంగా డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నాడని తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ రాకెట్ గురించి తెలిసి వలవేసిన పోలీసులు ఇంతకు ముందే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఓ ప్రబుద్ధుడు ఏకంగా 75 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగితే ఇదొక విచిత్రమైన కేసు మాత్రమే అయ్యేది. కానీ అతను అక్కడితో ఆగలేదు. మహిళలకు వలవేసి వారిని వ్యభిచారంలోకి దింపాడు. అలా ఏకంగా 200మంది అమ్మాయిల్ని నరకకూపంలోకి నెట్టి.. ఆ డబ్బులతో తను జల్సాలు చేసేవాడు. చివరికి పోలీసులకు చిక్కడంతో అతని బండారం బయటపడింది. 

ఉమెన్ ట్రాఫికింగ్ అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయాలు తెలిసి షాక్ కు గురయ్యారు. అతను బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని అక్రమరవాణా చేయడమే కాదు, వారిని బలవంతంగా డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నాడని తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఈ రాకెట్ గురించి తెలిసి వలవేసిన పోలీసులు ఇంతకు ముందే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెడితే... బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్ లోకి అక్రమంగా రవాణా చేయడంతోపాటు, ఏకంగా 75 మందిని వివాహం చేసుకున్న ఓ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇటీవల ఓ sex racket గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార కూపం నుంచి 21 మంది యువతులను రక్షించారు. 

Facebook Down : గంటల వ్యవధిలో 7 బిలియన్ డాలర్లు హాంఫట్.. 3 నుంచి 5వ స్థానానికి పడిపోయిన జుకర్బర్గ్...

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్ Bangladeshi pimp గుజరాత్ లోని సూరత్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్ లోని జాసుర్ కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్.. ఆ దేశానికి చెందిన యువతులను ఉపాధి నెపంతో భారత్లోకి అక్రమ రవాణా చేసేవాడు.  

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్  మీదుగా ఈ women trafficking వ్యవహారం సాగేది.  ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ. 25 వేల చొప్పున లంచం ఇచ్చేవాడు.  అనంతరం బంగ్లాదేశ్ యువతులను  ముంబై,  కోల్కతా  ప్రధాన కేంద్రాలుగా మునిర్ prostitutionలోకి దింపిన వాడని పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు ఇలా 200 మంది యువతులను భారత్లోకి అక్రమ రవాణా చేసినట్లు చెప్పారు. మరోవైపు, తాను ఇప్పటి వరకు 75 మందిని వివాహం చేసుకున్నట్లు మునిర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. 

click me!