సైబర్ హ్యాకర్ల్ బారిన పడ్డ ‘గో డాడీ’.. 12 లక్షల మంది యూజర్ల డేటా ప్రమాదంలో..

By AN TeluguFirst Published Nov 23, 2021, 1:54 PM IST
Highlights

నవంబర్ 17న మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లో అనధికారిక థర్డ్ పార్టీ యాక్సెస్ ను కంపెనీ గుర్తించింది.  దీంతో వెంటనే ఐటీ ఫోరెన్సిక్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టగా సైబర్ దాడి జరిగినట్లు తెలిసింది. అనధికారిక థర్డ్ పార్టీ వ్యక్తులు.. పాస్ వర్డ్ తో  మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ సిస్టమ్ ను యాక్సెస్ చేశారు.

నేటి రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న నేరాలు చేస్తూ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం కాకుండా.. పెద్ద ఎత్తున సైబర్ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. అలా ప్రముఖ వెబ్ కాస్టింగ్ కంపెనీ, ఇంటర్నెట్ డొమైన్ రిజిస్ట్రార్ goddadyపై సైబర్ దాడి జరిగింది.  తమ సంస్థ నిర్వహిస్తున్న Managed Word Press Serviceపై హ్యాకర్లు దాడి చేశారు.  12 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను చోరీ చేసినట్లు గోడాడీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ 17న మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ లో అనధికారిక  Third party access ను కంపెనీ గుర్తించింది.  దీంతో వెంటనే ఐటీ ఫోరెన్సిక్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టగా సైబర్ దాడి జరిగినట్లు తెలిసింది. అనధికారిక థర్డ్ పార్టీ వ్యక్తులు.. Passwordతో మేనేజ్డ్ వర్డ్ ప్రెస్ సిస్టమ్ ను యాక్సెస్ చేశారు.

దీన్ని గుర్తించిన వెంటనే మే ఆ థర్డ్ పార్టీని  మన సిస్టమ్స్ నుంచి బ్లాక్ చేశాం.  అయితే సెప్టెంబర్ 6 నుంచే ఈ దాడి మొదలైనట్లు దర్యాప్తులో తెలిసింది. వర్డ్ ప్రెస్ ను ఉపయోగించే దాదాపు 12 లక్షల యాక్టివ్, ఇన్ యాక్టివ్ యూజర్ల ఈ-మెయిల్ అడ్రస్ లు, కస్టమర్ నెంబర్లు బహిర్గతం కావడంతో వారి Personal data ప్రమాదంలో పడింది. దీనిపై మరింత దర్యాప్తు జరుపుతున్నాం.  Hacking కు గురైన బాధిత కస్టమర్లను గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. కస్టమర్ల పాస్వర్డ్ లను రీసెట్ చేస్తున్నాం’ అని కంపెనీ వెల్లడించింది.

రోడ్లపై కరెన్సీ నోట్లు: వాహనాలు ఆపి తీసుకొన్న జనం, ట్రాఫిక్ జామ్

వర్డ్ ప్రెస్ అనేది వెబ్ ఆధారిత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం. సొంతంగా బ్లాగులు, వెబ్ సైట్లు తెరుచుకునేందుకు వినియోగదారులు దీన్ని ఉపయోగిస్తుంటారు.  గో డాడీ  ఈ సర్వీస్ను నిర్వహిస్తోంది.  ఈ కంపెనీకి  ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్ల మందికిపైగా యూజర్లు ఉన్నారు. 

ఇదిలా ఉండగా, 2021 ఆగస్ట్ 18లో ఇలాంటిదే ఓ హ్యాకింగ్ జరిగింది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పెగాసస్‌కు మించి Cyber ​​hackers నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌‌కు ముందుగా లింక్ పంపి ఓటీపీ అడుగుతున్నారు కేటుగాళ్లు. ఓటీపి చెప్పిన వెంటనే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వాట్సాప్ వెళ్లిపోతుంది. 

50ఏళ్ల మిస్టరీ.. ఫ్లైట్ హైజాక్ చేసి ఆకాశంలోనే మాయమైన ఆ వ్యక్తి వివరాలు ఇంకా రహస్యమే

WhatsApp number‌తో డయల్ వెరిఫికేషన్ చేసుకుని.. వాట్సాప్‌లోని డేటా బ్యాకప్ తీసుకుంటున్నారు. అనంతరం వాట్సాప్‌ నెంబర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇటీవల ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. Hack number నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ బ్యాకప్‌లో కాంటాక్ట్ వున్న వాళ్లందరికీ డబ్బు కావాలంటూ మెస్సేజ్ పెడుతున్నారు. 

click me!