ఐదుగురి కొరియన్ మహిళలకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్.. ఆస్ట్రేలియాలో భారత సంతతిపై కేసు

By Mahesh KFirst Published Apr 24, 2023, 11:14 PM IST
Highlights

ఆస్ట్రేలియాలో ఓ భారత సంతతి వ్యక్తి మహిళలపై అఘాయిత్యాలకు దిగాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేసిన కేసులో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ఆ ఘటనలను బాలేశ్ ధంకడ్ వీడియోలు కూడా తీసి పెట్టుకున్నాడు.
 

మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన బాలేశ్ ధంకడ్‌‌పై దారుణమైన నేరపూరిత కేసు నమోదైంది. ఆ కేసులో కోర్టు అతన్ని దోషిగానూ తేల్చింది. ఐదుగురు కొరియన్ మహిళలకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేశాడని ధంకడ్ పై అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు, ఆ చర్యలను వీడియో కూడా తీశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో సిడ్నీలో చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియాలోని భారత కమ్యూనిటీకి చెందిన కీలక సభ్యుడు బాలేశ ధంకడ్. ఇటీవల నగరంలో చోటుచేసుకున్న అత్యంత హేయమైన, దారుణమైన రేపిస్ట్ ఇతను అని ఓ మీడియా రిపోర్టు పేర్కొంది. రాజకీయంగా సంబంధాలు ఉన్న మానవ మృగం.. ఐదుగురు కొరియన్ మహిళలను అబద్ధాల ఉచ్చుల్లో చిక్కించుకుని, డ్రగ్స్‌ను నిస్సహాయులను చేసి వారిపై అమానుష రీతిలో లైంగికదాడులకు పాల్పడ్డాడని జిల్లా కోర్టు జ్యూరీ పేర్కొంది. ఆయన గతంలో బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్‌కు మాజీ చీఫ్‌గా వ్యవహరించాడు.

తన సెక్సువల్ యాక్ట్‌లను ధంకడ్ తన మొబైల్ ఫోన్, బెడ్ దగ్గరే ఉన్న అలారం గడియారంలో ఉంచిన కెమెరాలతో రికార్డు చేసుకున్నాడు. ఆయనపై నమోదైన 39 అభియోగాలకు అతను గిల్టీ అని జ్యూరీ ఫోర్మన్ పేర్కొన్నాడు. అనంతరం, ఆయన చేతికి బేడీలు వేసి తీసుకెళ్లారు. బెయిల్ ఇవ్వాలని కోరినా కోర్టు తిరస్కరించింది. 

Also Read: మరీ ఇంత నిర్లక్ష్యమా ? రైలు నడుపుతూ సెల్ ఫోన్ వాడిన మహిళా లోకో పైలెట్.. తరువాత ఏమైందంటే ? వీడియో వైరల్

ధంకడ్ ఇతర మహిళలతో గడిపిన సమయాలను చిత్రించిన వీడియోలు డజన్ల సంఖ్యలో 2018లో పోలీసులకు దొరికాయి. కొన్ని సార్లు ఆ మహిళలు స్పృహలో లేకుండా ఉన్నారని, మరికొన్ని సార్లు పీడకలలో వేసినట్టు అరుపులు వేస్తూ కనిపించారు. ఆ వీడియోలను కొరియన్ మహిళల పేర్లతో ఫోల్డర్లుగా వేరు చేసి పెట్టుకున్నాడు. ఒక వీడియోనైతే 95 నిమిషాలపాటు ఉన్నదని, చిన్న చిన్న వీడియో లను కలిపి అలా తయారు చేసుకున్నాడని తెలిసింది. 

ఈ వీడియోలను జడ్జీ ఇబ్బందికరంగా వీక్షించాడు.

click me!