కరోనా వ్యాక్సిన్ : రక్తాన్ని గడ్డ కట్టిస్తున్న జాన్సన్ టీకా.. అమెరికాలో నిలిపివేత..

By AN TeluguFirst Published Apr 14, 2021, 2:52 PM IST
Highlights

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మెదడులో రక్తం గడ్డ కట్టి పోతున్న లక్షణాలు పడుతుండటంతో ఆ వ్యాక్సిన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మెదడులో రక్తం గడ్డ కట్టి పోతున్న లక్షణాలు పడుతుండటంతో ఆ వ్యాక్సిన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మెదడు నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాల్లో రక్తం గడ్డకడుతోందని, అందులోనూ ప్లేట్లెట్లు తక్కువగా ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే ఇవ్వగా, వారిలో ఆరు మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి.యూరోపియన్ యూనియన్లో సైతం ఆ్రస్టాజెనెకా వ్యాక్సిన్తో ఇలాంటి లక్షణాలు కనిపించడంతో వాడకాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.

కాగా ఈనెల మొదట్లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టడం అనే అరుదైన వ్యాధికి గురైన 30 మందిలో  ఏడుగురు మరణించినట్లు యుకె మెడికల్ రెగ్యులేటర్ తెలిపింది.

అంతేకాదు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టం లక్షణాలు కనిపిస్తున్నాయని అనేక యూరోపియన్ దేశాలు దీన్ని వాడకానికి విరామం ఇచ్చాయి. దీంతో ఈ మరణాలను ఆస్ట్రాజెనెకా జబ్ వాడకం వల్లే జరిగాయని బ్రిటిష్ గుర్తించింది. 

మార్చి 24 వరకు నమోదైన 30 కేసులలో 7 గురు మరణించడం విచారకరం అంటూ
యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో 18.1 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్లు వేసిన తరువాత ప్రభుత్వ వెబ్ సైట్లు ఈ కంప్లైంట్స్ తో నిండిపోయాయి. ఆరోగ్యనిపుణులు, ప్రజలు థ్రోంబోసిస్ రిపోర్టులను అప్ లోడ్ చేశారు. 

ఈ 30 కేసుల్లో ఎక్కువ కేసులు దాదాపు 22 కేసుల్లో సెరిబ్రల్ వెనస్ సైనస్ థ్రోంబోసిస్ అనే అరుదైన రక్తం గడ్డకట్టే వ్యాధి లక్షణాలు కనిపించగా, మిగతా 8 కేసుల్లో ప్లేట్ లెట్ ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల వచ్చే థ్రోంబోసిస్‌ తో బాధపడుతున్నారు. 

కానీ పెరుగుతున్న ఆందోళనల కారణంగా అనేక దేశాలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేయడమో, విరామం ఇవ్వడమో చేశాయి. రక్తం గడ్డకట్టే కేసులు యువతలోనే ఎక్కువగా కనిపిస్తుండడంతో కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను వృద్ధులకు మాత్రమే పరిమితం చేశాయి. 

తాజాగా ఏప్రిల్ మొదటివారంలో నెదర్లాండ్స్ ఆస్ట్రాజెనికా జాబ్ వ్యాక్సిన్ ను 60యేళ్ల లోపు వారికి వేయడాన్ని ఆపేసింది. నెదర్లాండ్స్ లో వ్యాక్సిన్ వేసుకున్న ఐదుగురు యువతులు ఈ వ్యాధి బారిన పడగా అందులో ఒకరు మరణించారు. 

జర్మనీలోనూ ఇలాంటి 31 కేసుల బయటపడ్డ తరువాత 60యేళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయడాన్ని ఆపేసింది. ఈ 31మందిలో వయసులో చాలా చిన్నవాళ్లు, లేదా మధ్యవయస్కులైన మహిళలే ఉండడం గమనార్హం. 

ఫ్రాన్స్‌తో సహా అనేక ఇతర దేశాలు ఇలాంటి వయో పరిమితులను విధించగా, డెన్మార్క్, నార్వేలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేసాయి.
 

click me!