టోక్యో ఒలంపిక్స్ : యాంటీ సెక్స్ బెడ్స్.. అవన్నీ అవాస్తవాలే.. బెడ్ల మీద ఎగిరి చూపించిన జిమ్నాస్ట్..

By AN TeluguFirst Published Jul 19, 2021, 12:57 PM IST
Highlights

కార్డ్ బోర్డ్ లతో చేసిన మంచాలైనప్పటికీ దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్ కు చెందిన జిమ్రాస్టిక్స్ ఆటగాడు రిస్ మెక్ క్లెనఘన్ తన ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

టోక్యో : శృంగారం కట్టడి కోసం ఒలింపిక్స్ ఆటగాళ్ల గదుల్లో తక్కువ సామర్థ్యమున్న మంచాలను ఏర్పాటు చేశారంటూ వస్తున్న వార్తల్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ఖండించారు. అట్టలతో చేసినప్పటికీ.. అవి దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. 

200 కిలోల వరకు బరువు మోయగలవని తెలిపారు. ఆ మేరకు ముందే అన్ని రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు కార్డ్ బోర్డ్ లతో చేసిన మంచాలైనప్పటికీ దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్ కు చెందిన జిమ్రాస్టిక్స్ ఆటగాడు రిస్ మెక్ క్లెనఘన్ తన ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

ఒలంపిక్స్ లో శృంగారానికి అడ్డకట్ట వేసేందుకు..!

వాటిపై ఎగురుతూ ఆ మంచాల సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు. ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. దీనికి ఒలింపిక్స్ నిర్వాహకులు.. రిస్ కు ధన్యవాదాలు తెలిపారు. 

కరోనామహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారంటూ అమెరికాకు చెందిన ఓ ఆటగాడు ట్వీట్ చేయడంతో ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించి దీనిపై స్పష్టతనిచ్చారు. 


 

“Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB

— Rhys Mcclenaghan (@McClenaghanRhys)
click me!