బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా మృతి

By narsimha lodeFirst Published Nov 11, 2020, 4:33 PM IST
Highlights

 సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం నాడు మరణించాడు.ఆయన వయస్సు 84 ఏళ్లు.
 


మనమా: సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం నాడు మరణించాడు.ఆయన వయస్సు 84 ఏళ్లు.

1971 నుండి ఆయన బ్రహెయిన్ కు ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఆయన ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేసిన రికార్డు ఖలీఫా పేరున ఉంది.

2011లో షియా నేతృత్వంలోని నిరసనకారులు మనమా లోని పెర్ల్ స్వ్కేర్ ను నెల రోజుల పాటు ఆక్రమించారు. ఖలీఫా పదవీ విరమణ చేయాలనే డిమాండ్ తో పెర్ల్ స్వ్కెర్ ను వారు ఆక్రమించారు.

బహ్రెయిన్ ఆర్ధిక, రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా  ఆయన తనదైన ముద్రను వేశారు. అమెరికాలోని మయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా మరణించినట్టుగా బహ్రెయిన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అంత్యక్రియలకు సమీప బంధువులను మాత్రమే అనుమతించనున్నట్టుగా ఆ వార్తా సంస్థ తెలిపింది.దేశంలో వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

1935 నవంబర్ 24వ తేదీన ఖలీఫా జన్మించారు. అతను తన తండ్రి రాయల్ కోర్టుకు సోదరుడు ప్రిన్స్ ఇస్సాతో కలిసి ఏడేళ్ల వయస్సులోనే వెళ్లేవాడు.1970లో రాష్ట్ర కౌన్సిల్, ప్రభుత్వ కార్యానిర్వాహక శాఖాధిపతిగా ఆయన పనిచేశారు. 

ఇది బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత మంత్రుల మండలిగా మారింది.
షా ఆఫ్ ఇరాన్ ద్వీపాలకు చేసిన వాదనలపై కఠినమైన వాదనలు చేశాడు.  ఇండిపెండెన్స్ కంటే ముందు మహమ్మద్ రెజా పహ్లావిత్, ఇరాన్  షా తో చర్చించాడు.

బహ్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణలో సున్నీ అల్ -ఖలీఫా రాజవంశం పాలనలో స్వాతంత్ర్యానికి అనకూలంగా మెజారిటీ ఓటు దక్కింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత షేక్ ఖలీఫా ప్రభుత్వం వామపక్ష రాజకీయ సమూహాల నుండి పెద్ద ఎత్తున నిరసనలను ఎదుర్కొంది.

కార్మిక సంఘాలను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేసింది. నిరసనకారులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు.1972లో ఒక రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతి ఏడాదే బహ్రెయిన్ కు తొలి రాజ్యాంగాన్ని రూపొందించారు. 

మొదటి పార్లమెంటరీ ఎన్నికలు 1973 డిసెంబర్ లో జరిగాయి. అయితే రాష్ట్ర భద్రతా చట్టాన్ని ఆమోదించడానికి నిరాకరించడంతో షేక్ ఖలీఫా ప్రభుత్వాన్ని 1975 ఆగష్టులో రద్దు చేశారు.

1980 ప్రారంభంలో రాజకీయ అశాంతి మళ్లీ చెలరేగింది. 1981 చివరలో ఇరాన్ మద్దతుగల తిరుగుబాటు ప్రయత్నం విఫలమైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రిన్స్ ఖలీఫా బహ్రెయిన్ ను ప్రాంతీయ ఆర్ధిక కేంద్రంగా స్థాపించేందుకు చాలా ఏళ్లుగా కృషి చేశారు.  తన సోదరుడు దివంగత షేక్ ఇస్సాబిన్ సల్మాన్ అల్ -ఖలీఫాతో కలిసి పనిచేస్తూ వాషింగ్టన్ తో బలమైన సంబంధాలను కోరుకొన్నాడు.

1994లో షియా నేతృత్వంలోని ప్రదర్శనలు పెద్ద ఎత్తున సాగాయి. నిరసనకారులు ఎన్నికైన పార్లమెంట్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. సంపదను సమానంగా పంచాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమాల్లో సుమారు 38 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ నిరసనలు 1999 వరకు కొనసాగాయి. హమాద్ రాజు సింహాసనాన్ని అధిరోహించాడు.  రాజ్యాంగ సంస్కరణలను ప్రారంభించాడు. ఇది బహ్రెయిన్ రాజ్యాంగ రాచరికంగా మార్చి 2002 లో ఎన్నికైన పార్లమెంట్ ను తిరిగి స్థాపించింది.


 

click me!