వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. సాధారణ చికిత్సతో ఒమిక్రాన్ విముక్తి..!

By Ramya news teamFirst Published Dec 22, 2021, 9:45 AM IST
Highlights

తమ దేశంలోని చాలా మంది సాధారణ, సులభమైన చికిత్సతో ఈ వేరియంట్ నుంచి కోలుకుంటున్నారని చెప్పారు. మరి ఈ మహమ్మారి నుంచి ఎలా విముక్తి పొందాలో.. ఆమె చెప్పిన వివరాలేంటో ఓసారి చూద్దాం..

కరోనా మహమ్మారి మనల్ని వదిలి వెళ్లేలా కనపడటం లేదు. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ కల్లోలం సృష్టించగా..  ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వణికించడం మొదలుపెట్టింది.  ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అనేక దేశాల్లో రోజు రోజుకు కొత్త కేసులు పెరిగిపోతుండటంతో.. ఆయా దేశాల్లో రోజు రోజుకు కొత్త కేసులు పెరిగిపోతుతండటంతో ఆయా దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫప్రికాకు చెందిన వైద్య నిపుణురాలు మనందరికీ.. కాస్త ఉపశమనం కలిగించే వార్త తెలియజేశారు,

Also Read: కొవిషీల్డ్ రక్షణ మూడు నెలల తర్వాత సన్నగిల్లుతుంది... లాన్సెట్ అధ్యయనం
ఒమిక్రాన్ ను తొలుత గుర్తించిన డా.ఏంజెలిక్ కోయోట్జీ మాట్లాడారు. తమ దేశంలోని చాలా మంది సాధారణ, సులభమైన చికిత్సతో ఈ వేరియంట్ నుంచి కోలుకుంటున్నారని చెప్పారు. మరి ఈ మహమ్మారి నుంచి ఎలా విముక్తి పొందాలో.. ఆమె చెప్పిన వివరాలేంటో ఓసారి చూద్దాం..

రోగ నిర్థారణ అయిన తర్వాత వెంటనే.. తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రొఫెన్ వంటి మందులు తీసుకోవాలట. ఇవి కండరాల నొప్పి, తలనొప్పిలను తగ్గిస్తాయి.  ఇవి తప్ప.. మరే ఇతర  మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. ఆక్సీజన్, యాంటీ బయాటిక్స్ కూడా అవసరం లేదని చెప్పారు.

Also Read: Omicron Death in US: అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం.. కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్‌వే..

ఒమిక్రాన్ లక్షణాల గురించి ఆమె మాట్లాడుతూ... ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చాలా వరకు ఒళ్లు నొప్పులు, తల నొప్పి,, అలసట వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయన్నారు. కొందరికి మాత్రమే పొడి దగ్గు, గొంతు గరగర ఉంటోందని చెప్పారు.

టీకా తీసుకొని వారు వ్యాధి ప్రభవానికి ఎక్కువగా గురికావడం, ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. అయితే.. టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఈ వేరియంట్ లక్షణాలు  స్వల్పంగానే కనిపించాయన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే.. ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చిందన్నారు. డెల్టాతో పోలిస్తే.. ఈ వేరియంట్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం  చూపించలేదని ఆమె స్పష్టం చేశారు.

click me!