కొవిషీల్డ్ రక్షణ మూడు నెలల తర్వాత సన్నగిల్లుతుంది... లాన్సెట్ అధ్యయనం

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకా రెండు డోసులు వేసుకున్న మూడు నెలల తర్వాత దాని ప్రభావం సన్నగిల్లుతున్నదని లాన్సెట్ అధ్యనం వెల్లడించింది. స్కాట్లాండ్, బ్రెజిల్‌లో చేపట్టిన ప్రయోగాల్లో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో మూడు నెలల తర్వాత టీకా ప్రభావం తగ్గిపోయిందని తెలిపింది. కాబట్టి, ప్రభుత్వాలు బూస్టర్ డోసుపై సరైన దృష్టితో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
 

covishield efficacy waning after three months says lancet

న్యూఢిల్లీ: మనదేశంలో ఎక్కువగా కొవిషీల్డ్(Covishield) టీకానే వేశారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(Oxford University) అభివృద్ధి చేసిన ఈ టీకా(Vaccine)ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నది. తొలిసారిగా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు సీరం కీలక పాత్ర పోషించింది. అత్యల్ప సమయంలో అత్యధిక సంఖ్యలో టీకాలను ఉత్పత్తి చేసి దేశంలోని డిమాండ్‌ను ఛేదించడంలో అమోఘమైన పాత్ర నిర్వహించింది. మన దేశంల కొవిషీల్డ్‌ తర్వాత అత్యధికంగా పంపిణీ చేసిన టీకాల్లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ఉంటుంది. అయితే, ఎక్కువ మంది తీసుకున్న కొవిషీల్డ్ టీకాపై Lancet అధ్యయనం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్ ఎక్కువ కాలం రక్షణ ఇవ్వలేదని, రెండో డోసు వేసుకున్నాక మూడు నెలల్లో దాని సామర్థ్యం సన్నగిల్లుతుందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ఈ సందర్భంలోనే ప్రపంచ దేశాలు బూస్టర్ డోసు ఇవ్వడంపై సరైన దృష్టితో నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొంటుందా? లేదా? అనే విషయాన్ని ఈ అధ్యయనం పేర్కొనలేదు.

ఈ ఏడాది తొలినాళ్లలో భారత దేశాన్ని కుదిపేసిన డెల్టా వేరియంట్‌ను కొవిషీల్డ్ టీకా సమర్థవంతంగా ఎదుర్కొన్నదని లాన్సెట్ అధ్యయనం ఇటీవలే పేర్కొంది. ఈ అధ్యయనం వెలువడిన వారం రోజుల్లోనే మరో అధ్యయనం అంచనాలను పేర్కొంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారికి 63 శాతం రక్షణ ఉంుటందని తెలిపింది. రెండో డోసు వేసుకన్న మూడు నెలల తర్వాత ఈ వ్యాక్సిన్ పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చునని వివరించింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ మూడు నెలల తర్వాత ఇది ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపింది.

Also Read: Covishield Booster Dose: బూస్ట‌ర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలంటే..?

స్కాట్లాండ్, బ్రెజిల్‌లలో కరోనా ముప్పు.. కొవిషీల్డ్ టీకా సామర్థ్యంపై పరిశోధనలు జరిపారు. ఈ ఏడాది మే 19వ తేదీ నుంచి స్కాట్లాండ్‌లో జనవరి 18వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీ వరకు ప్రయగాలు చేశారు. ఈ ప్రయోగాల ఫలితాల్లోనే పై విషయం వెలుగులోకి వచ్చినట్టు లాన్సెట్ వివరించింది. రెండు డోసుల కొవిషీల్డ్ తీసుకున్నాక మూడు నెలల తర్వాత స్కాట్లాండ్, బ్రెజిల్‌లలో మళ్లీ కేసులు పెరగడం, హాస్పిటల్‌లో అడ్మిషన్లు పెరగడం జరిగాయని తెలిపింది. అంటే... కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నాక మూడు నెలల తర్వాత దాని ప్రభావం తగ్గిపోయిందనే విషయాన్ని ఇది వెల్లడిస్తున్నదని పేర్కొంది

గత కొద్దికాలంగా బూస్టర్ డోసుల పంపిణీపై చ‌ర్చ జరుగుతోంది. ప్ర‌స్తుత ప‌రిమాణంలో ఈ చ‌ర్చ మ‌రింత‌ జోరందుకుంది. చాలా రాష్ట్రాల నుంచి కేంద్రానికి బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్రం కూడా ఇదే అంశంపై గురువారం సమావేశం నిర్వహించింది. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించిన‌ట్టు తెలిపింది. ఈ స‌మావేశంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స‌భ్యులు హాజరయ్యారు. 

Also Read: బూస్ట‌ర్ డోస్‌గా కోవిషీల్డ్ వేసుకోవ‌చ్చు.. అనుమ‌తిచ్చిన డీసీజీఐ

అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది.  ఈ బూస్ట‌ర్ టీకా ప్ర‌భావం.. క‌రోనా ప‌లు వేరియంట్ల ప్ర‌భావం ఉంటుంద‌ని,  బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తే ఓమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదురుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయం ప‌డ్డారు. ముందుగా వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోసులు ఇవ్వాలని డిమాండ్లు ఉన్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios