గాడిద పాలతో కరోనా కి చెక్..? నిజమెంత..?

By Ramya news teamFirst Published Dec 10, 2021, 1:56 PM IST
Highlights

ఆ గాడిద పాలు అమ్మకం దారులు కూడా.. విపరీతమైన డిమాండ్ తీసుకురావడం గమనార్హం. గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.  
 

గాడిద పాలు.. ఆరోగ్యానికి మంచిదనే విషయం చాలా మందికి తెలుసు. అయితే... ఈ  పాలు కరోనా మహమ్మారిని కూడా తగ్గిస్తాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో..  మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో... ఈ పాలకు బాగా డిమాండ్ పెరిగింది. కరోనాను తరిమి కొడుతుందని... రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అక్కడి వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ పాలను విపరీతంగా అక్కడి ప్రజలు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.

వారి డిమాండ్ ని బట్టి..  ఆ గాడిద పాలు అమ్మకం దారులు కూడా.. విపరీతమైన డిమాండ్ తీసుకురావడం గమనార్హం. గాడిద పాలకు గరిష్ఠంగా లీటరుకు పది వేల రూపాయలు వెచ్చించిమరీ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బారీ స్థాయలో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.  

Also Read:ప్రెగ్నెన్సీ టైంలో కలలు ఎందుకు ఎక్కువగా వస్తాయో తెలుసా? వాటి సంకేతాలు ఏంటో తెలుసా?

హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని, పిల్లలకు న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. 

అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. దీనితో జనాలు విపరీతంగా కొనుగోలు సాగిస్తున్నారు.

Also Read: వాముతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటో తెలుసుకోండి!

ఈ వందంతులన్నీ పూర్తిగా అవాస్తవాలని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని, ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్‌ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు.
 

click me!