ప్లాస్టిక్ బాక్స్ లో ఫుడ్ ను పెడితే ఏమౌతుందో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jun 6, 2023, 4:39 PM IST
Highlights

ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో హాని చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. 
 


పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంటుంది. ఈ ఏడాది థీమ్ 'ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్'. మన చుట్టూ, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. కానీ మన జీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. 

ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లను తాగడం చాలా అవసరం. ఇందుకోసం ప్రతి 80 మందిలో 100 మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ (బిపిఎ) అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ లను అస్సలు ఉపయోగించకూడదు.

ప్లాస్టిక్ బాటిల్స్ మాదిరిగానే.. బిస్ఫెనాల్ ఎ (బిపిఎ) ను ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది దానిలో ఉంచిన ఆహార పదార్థాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. మనం వీటిని తింటే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును ఉపయోగించే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికారక పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి. దీనివల్ల  ఎన్నో రోగాలు వస్తాయి. అంతేకాదు కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఇది ఉదర సంబంధిత వ్యాధులను పెంచుతుంది. అందుకే  బ్లాస్టిక్ కాకుండా చెక్క లేదా రాతి చాపింగ్ బోర్డును ఉపయోగించండి.

ప్రస్తుతం ఇండ్లలో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగింది. ఇది వ్యాధులను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోతాయి. ఇది మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నేడు ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడుతున్నారు.

click me!