బ్లడ్ క్యాన్సర్.. ఈ లక్షణాలను తేలిగ్గా తీసిపారేయకండి

By Mahesh RajamoniFirst Published May 30, 2023, 2:49 PM IST
Highlights

బ్లడ్ క్యాన్సర్ అత్యంత సాధారణ రకాలలో ఒకటి. రక్త ఉత్పత్తి తగ్గడాన్ని బ్లడ్ క్యాన్సర్ లేదా లుకేమియా అంటారు. ఈ క్యాన్సర్ ను మొదట్లో గుర్తించడం చాలా కష్టం. కానీ దీనిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. 

రక్త క్యాన్సర్ అత్యంత సాధారణ రకాలలో ఒకటి. రక్త ఉత్పత్తి తగ్గడాన్ని బ్లడ్ క్యాన్సర్ లేదా లుకేమియా అంటారు. దీనిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గి,  తెల్లరక్తకణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. బ్లడ్ క్యాన్సర్ ను మొదట్లో గుర్తించడం కష్టం. కానీ తరచుగా శరీరం కొన్ని లక్షణాలను చూపుతుంది. లుకేమియా ఉన్నవారిలో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి బాగా పడిపోతుంది. ఇది రక్తహీనత, అలసటకు దారితీస్తుంది. మీరు ఎప్పుడూ అలసిపోయినట్టుగా, మైకంగా అనిపిస్తే వెంటనే  హాస్పటల్ కు వెళ్లండి. అలాగే టెస్ట్ లు చేయించుకోండి. బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గడం:  కారణం లేకుండా అంటే మీరు ప్రయత్నించకుండా బరువు తగ్గితే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది బ్లడ్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. ఆహారం లేదా వ్యాయామంలో ఎటువంటి మార్పు లేకుండా అకస్మత్తుగా బరువు తగ్గితే తప్పకుండా టెస్టులు చేయించుకోండి. ఇది బ్లడ్ క్యాన్సర్ కు సంకేతం.

ఎముకలు, కీళ్లలో నొప్పి: ఎముకలు లేదా కీళ్లలో ఎప్పుడూ నొప్పి కలుగుతోందా? అలాగే ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటోందా? అయితే మీరు బ్లడ్ క్యాన్సర్  టెస్ట్ ను చేయించుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలే. 

అలసట: కంటినిండా నిద్ర, తగినంత విశ్రాంతి తీసుకున్నా మీరు ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటున్నారా? అయితే మీరు బ్లడ్ క్యాన్సర్ టెస్ట్ ను చేయించుకోవాలి. ఎందుకంటే నిరంతర అలసట కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణమే కాబట్టి. 

గాయాలు మానకపోవడం: చిన్న చిన్న గాయాల నుంచి దీర్ఘకాలిక రక్తస్రావాన్ని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది బ్లడ్ క్యాన్సర్ లక్షణం కాబట్టి. 

ఛాతీ నొప్పి: తరచుగా ఛాతిలో నొప్పి, శ్వాస ఆడకపోవడం బ్లడ్ క్యాన్సర్ లక్షణం కావొచ్చంటున్నారు నిపుణులు.

బలహీనమైన రోగనిరోధక శక్తి: బ్లడ్ క్యాన్సర్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది త్వరగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఎన్నో రోగాల బారిన ఈజీగా పడేస్తుంది.

రక్తస్రావం:  ముక్కు నుంచి, నోటి నుంచి, మలద్వారం, మూత్రాశయం నుండి అసాధారణ రక్తస్రావం కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలే. 

నోటిపై పండ్లు: తలనొప్పి, జ్వరం, చర్మంపై దద్దుర్లు, నోట్లో పుండ్లు కావడం బ్లడ్ క్యాన్సర్ లక్షణాలే. 

click me!