ఎండాకాలంలో అయితే ప్రతి ఒక్కరూ చల్ల నీళ్లనే తాగుతారు. అయితే వెదర్ చల్లగా ఉన్నప్పుడు మాత్రం వేడి నీళ్లను తాగుతుంటారు. కొంతమంది చాలా కూల్ వాటర్ ను, హాట్ వాటర్ ను మిక్స్ చేసి తాగుతుంటారు. కానీ ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
కొంతమందికి వింత వింత అలవాట్లు ఉంటాయి. అందులో చల్ల నీటిని, హాట్ వాటర్ ను మిక్స్ చేసి తాగడం ఒకటి. ఈ అలవాటు మంచిదని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఫ్రిజ్ నుంచి చల్లటి నీటిని తీసుకుని వేడినీటిని కలిపే అలవాటు మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ అలవాటు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అజీర్ణం: ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్ణం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో కూల్ వాటర్ లో హాట్ వాటర్ ను మిక్స్ చేయడం కూడా ఉంది. అవును చల్లటి నీరు త్వరగా జీర్ణం అయినప్పుడు, వేడి నీరు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి వీటిని కలిపి తాగడం వల్ల అజీర్థి సమస్య వస్తుంది.
అనారోగ్యం: వేడి నీటిలో బ్యాక్టీరియా ఉండలేదు అన్న సంగతి మీకు తెలిసిందే. కానీ కూల్ వాటర్ లో మాత్రం బ్యాక్టీరియా చాలా ఉంటుంది. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని తాగడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాలను తగ్గిస్తుంది: వేడి నీళ్లు, చల్ల నీటిని కలిపి తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. అలాగే మీ శరీర ఉష్ణోగ్రతలో వ్యత్యాసం వస్తుంది. దీనివల్ల పోషకాల శోషణ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది: వేడి నీళ్లు రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయి. అదే చల్ల నీళ్లు వాటిని పునరుద్ధరిస్తాయి. ఈ రెండు కార్యకలాపాలు ఒకేసారి జరిగితే మాత్రం.. రక్త నాళాలలో అడ్డంకి ఏర్పడుతుంది.
నీటి ప్రయోజనాలు తగ్గుతాయి: నీళ్లను తాగడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వేడి , చల్లటి నీటిని కలిపి తాగితే వేడినీటి ప్రయోజనాలు పోవడమే కాకుండా చల్లని నీటి ప్రయోజనాలు కూడా పోతాయి. వీటితో మనకు ఎలాంటి లాభం ఉండదు.