ఉదయాన్నే ఈ నాలుగింటికి దూరంగా ఉంటే.. బరువు తగ్గడం ఈజీ..!

By ramya Sridhar  |  First Published Jul 13, 2024, 10:05 AM IST

అధిక కేలరీల ఆహారాలు తినడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. బరువు తగ్గడానికి మీ అల్పాహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.
 


ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అతిపెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు.  చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ.. పెరిగిపోయిన బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అధిక బరువు తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే..  ఈ సమస్య గుండె జబ్బులు, మధుమేహం, అభివృద్ధి లోపాలు వంటి అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

మీరు అధిక శరీర బరువు గురించి ఆందోళన చెందుతుంటే, దానిని సకాలంలో నియంత్రించడానికి ప్రయత్నించండి. అలాగే, అధిక బరువు వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తాయి. బరువు తగ్గడానికి వ్యాయామం , ఆహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, ఆహారాన్ని మెరుగుపరచడం చాలా కీలకం, నిపుణులు అంటున్నారు. అధిక కేలరీల ఆహారాలు తినడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. బరువు తగ్గడానికి మీ అల్పాహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

Latest Videos

అల్పాహారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.  ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన , పోషకమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. అలాగే, మీరు తినే అల్పాహారం మీ శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా?

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, అల్పాహారం పోషక విలువలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉదయం పూట తినకూడని కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే తినకూడని ఆహారాలు:

1. ఆయిల్ ఫుడ్స్..

బరువు తగ్గాలనుకునే వారు పూరీ, వడ, బజ్జీ, సమోసా, జిలేబీ వంటివి తినకూడదు.ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ నూనెను ఉపయోగిస్తాయి. ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. దీంతో శరీర బరువు మరింత పెరుగుతుంది. కాబట్టి.. వీటికి దూరంగా ఉండాలి.

2. ప్యాకేజ్డ్ జ్యూస్:

ఉదయాన్నే ప్యాక్డ్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది శరీర బరువును పెంచుతుంది. కారణం ఇందులో చక్కెర , హానికరమైన పదార్థాలు చాలా ఉన్నాయి. శరీర బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బదులుగా, ఇంట్లో తయారుచేసిన జ్యూస్ తాగడం మంచిది.

3. వైట్ బ్రెడ్:

చాలామంది  వైట్ బ్రెడ్ ని  అల్పాహారంగా తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే ఇందులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వును నిల్వ చేయడమే కాకుండా బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.

4. చాక్లెట్:

ఉదయాన్నే చాక్లెట్ తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని లావుగా మారుస్తుంది. కాబట్టి.. ఈ ఫుడ్స్ కి కనుక మీరు దూరంగా ఉంటే.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. 

click me!