రాగి పిండి రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 13, 2024, 2:21 PM IST

రాగుల వల్ల మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే రాగి పిండితో రకరకాల వంటలను తయారుచేసి తింటుంటారు. అసలు రాగులను తింటే ఏమౌతుందో తెలుసా?
 


రాగులను చాలా మంది రోజూ తింటుంటారు. రాగులు ముతక ధాన్యాల కోవలోకి వస్తాయి. దాని పిండితో రొట్టెలు, జావాతో పాటుగా ఎన్నో రకాల వంటలను తయారుచేసి తీసుకుంటుంటారు. నిజానికి ఈ పిండితో చేసిన వంటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రాగుల్లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అసలు రాగి పిండిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బలహీనత మాయం:  రాగుల పిండితో రొట్టెలను కూడా చేస్తారు. చాలా మంది ఈ రొట్టెలను చాలా ఇష్టంగా తింటుంటారు. ఈ రొట్టెలు టేస్టీగా ఉండటమే కాకుండా.. ఇవి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ పిండితో చేసిన రొట్టెలను రోజూ తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో బలహీనత సమస్య ఉండదు. 

Latest Videos

జీర్ణవ్యవస్థను బలోపేతం:  రాగుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పిండిని ఏదో ఒక విధంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడానికి:  రాగులు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాగుల్లో ఉండే పదార్థాలు బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ పిండితో చేసిన రొట్టెను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. 

ఎముకలు బలోపేతం: రాగుల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పిండితో తయారుచేసిన వంటకాలను తింటే మీ ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. దంతాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

రక్తంలో చక్కెర నియంత్రణ:  డయాబెటీస్ తో బాధపడే వారికి రాగుల పిండి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. రాగిపిండితో చేసిన  వంటకాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే రాగి పిండి రొట్టెలను రోజూ తినాలని డాక్టర్లు చెప్తారు. 

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం: మారుతున్న వాతావరణం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు, జలుబుతో పాటుగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే మీరు రాగులను రోజూ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 

click me!