చేపలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Published : Feb 10, 2023, 12:25 PM IST
చేపలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

సారాంశం

చేపలు పోషకాల భాండాగారం. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. చేపల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

చాలా మంది ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తింటుంటారు. ఇలాంటి ఆహారాల్లో చేపలు ఒకటి. చేపలు సూపర్ ఫుడ్. అయితే చాలా మంది రంగురంగుల కూరగాయలు, పండ్లనే సూపర్ ఫుడ్ గా భావిస్తారు. నిజానికి ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలు వీటికి తక్కువేం కాదు తెలుసా? ఎందుకంటే దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మీకు చేపల అలెర్జీ లేకపోతే  వీటిని ఎంచక్కా తినండి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 

చేపలు సూపర్ ఫుడ్

చేపలు మనకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. చేపలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. అయితే ఈ కొవ్వు ఆమ్లాలను మన శరీరం ఉత్పత్తి చేయదు. దీన్ని కేవలం ఆహారం ద్వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలలో ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లం (ఇపిఎ), డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ) పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు సరిగ్గా ఉండాలంటే ఈ కొవ్వు ఆమ్లాలు చాలా చాలా అవసరం. అంతేకాదు ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే శరీర మంటను తగ్గిస్తాయి. కొవ్వు చేపలలో ఎక్కువగా ఉండే ఇపిఎ, డిహెచ్ఎ డిప్రెషన్, చెడు కొలెస్ట్రాల్,  చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి

  • చేపలు ఇన్సులిన్ సున్నితత్వం, మంటను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. 
  • చేపలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ను, మంచి కొవ్వును కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • చేపలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. చేపలు దృష్టి, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. 
  • చేపల్లో ఉండే సెలీనియం, జింక్, అయోడిన్, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ డి వంటి సూక్ష్మపోషకాలు, విటమిన్లు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 

కానీ రాబిన్సన్ చేపలలో మిథైల్ పాదరసం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన న్యూరోటాక్సిన్. అలాగే ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అలాగే కింగ్ మాకేరెల్, కత్తి చేపలు, షార్క్, ట్యూనా వంటి కొన్ని రకాల చేపల్లో కూడా పాదరసం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ చేపలను ఎక్కువగా తినకూడదు. 

ఎర్ర మాంసం కంటే చేపలే ఆరోగ్యకరం

జంతు ప్రోటీన్ విషయానికి వస్తే.. ఎర్ర మాంసంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పోలిస్తే చేపలే మన ఆరోగ్యానికి చాలా మంచివి. చేపలలో మంచి కొవ్వులు, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. చేపలల్లో కండరాల ఫైబర్స్ తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే మంటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం