Covid19: చూయింగ్ తో కరోనాకి చెక్..? నిజమెంత..?

Published : Dec 02, 2021, 09:37 AM ISTUpdated : Dec 02, 2021, 10:58 AM IST
Covid19:  చూయింగ్ తో కరోనాకి చెక్..? నిజమెంత..?

సారాంశం

ఆ వేరియంట్ డెల్టా కన్నా కూడా ప్రమాదకరమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలేలా కనిపించడం లేదు. హమ్మయ్య.. కేసులు తగ్గిపోయాయి లే.. అనుకున్న ప్రతిసారీ.. ఆమహమ్మారి తన రూపాంతరం మార్చుకొని మరీ ఎటాక్ చేయడం మొదలుపెడుతోంది. గతేడాది డెల్టా వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీభత్సం సృష్టించింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే భయటపడి.. అందరూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే...  తాజాగా దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగుచూసింది.

ఆ వేరియంట్ డెల్టా కన్నా కూడా ప్రమాదకరమని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కరోనాని నిర్మూలించేందుకు  అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు కొత్త రకం చూయింగ్ ను ఆవిష్కరించారు.

Also Read: రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు..? మరీ నిద్ర ఎక్కువైనా ప్రమాదమే..!

ఈ చూయింగ్ గమ్ ద్వారా శరీరంలోకి చేరే కరోనా వైరస్ లోడ్ ను తగ్గించే అవకాశముందని... తద్వారా వైరస్ సంక్రమణ తీవ్రతను తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. నోట్లో ఉండే లాలాజలంలో కరోనా లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే.. లాలాజలంలో ఉండే కరోనా లోడ్ ను తగ్గించడమే లక్ష్యంగా పరిశోధకులు ఈ చూయింగ్ గమ్ ను సృష్టించారు.

ఏసీఈ2 అనే ప్రోటీన్ తో చూయింగ్ గమ్ ను తయారు చేశారు. ఈ ప్రోటీన్.. కరోనా వైరస్ శరీరంలోకి చొచ్చుకురావడానికి ఉపయోగించే కొమ్ములాంటి ప్రోటీన్. ఎప్పుడైతే ఈ ఈసీఈ2 లోని గ్రాహకాలకు లాలాజలంలో ఉండే వైరస్ అతుక్కుపోతుందో.. అప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలా ఈ చూయింగ్ గమ్ తో 95శాతం వైరస్ లోడ్ ను తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశోధన కోసం యూనివర్శిటీ ఆఫ్ సెన్సిల్వేనియా.. కరోనా సోకి ఆస్పత్రిపాలైన బాధితుల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు మాలిక్యూలర్ థెరపీ జర్నల్ లోనూ ప్రచురితమైయ్యాయి. వైరస్ ల నుంచి బాధితుల్ని కాపాడటానికి ప్రోటీన్ ను ఉపయోగించడం చాలా సులభమైన పద్ధతని.. దాన్నే చూయింగ్ గమ్ లో ఉపయోగించారని జర్నల్ లో పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం ఈ చూయింగ్ గమ్ అందుబాటులో లేదు. దీనికి యూఎస్ డ్రగ్ రెగ్యూలేటర్స్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!