మల్బరీ కాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.... ఈ వ్యాధులన్నింటికీ చెక్ పెట్టవచ్చు!

By Navya ReddyFirst Published Mar 25, 2023, 2:00 PM IST
Highlights

సాధారణంగా ప్రతిరోజు పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అంది మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా పోషక విలువలు కలిగినటువంటి వాటిలో మల్బరీ కాయలు కూడా ఒకటి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.మల్బరీ కాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...
 

మల్బరీ కాయలు చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నా వీటిలో పోషక విలువలు మాత్రం మెండుగా ఉన్నాయి.  మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉంటాయి.. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు సమస్యల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు వారంలో నాలుగు రోజుల పాటు ఈ పండ్లను తినడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

ఇక రక్తపోటు సమస్యతో మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇవి ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పాలి. తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధితో పాటు రక్తపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ కారకాలను కూడా పూర్తిగా అణిచివేస్తుంది. మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది.

ఇక ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించగా విటమిన్ డి, కాల్షియం కారణంగా ఎముకలు ఎంతో దృఢత్వాన్ని కలిగి ఉంటాయి.ఇక ఫైబర్ అధికంగా కలిగినటువంటి ఈ మల్బరీ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు నివారించడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఐరన్ అధికంగా కలిగినటువంటి ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలకు ఈ పండ్లు ఎంతో మంచివని చెప్పాలి.

click me!