రోజూ లెమన్ వాటర్ ను తాగుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఉదయం అస్సలు తాగరు..

By Mahesh RajamoniFirst Published Mar 25, 2023, 7:15 AM IST
Highlights

నిజానికి నిమ్మకాయ నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజూ తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.


నిమ్మకాయ నీటిని చాలా మంది తాగుతుంటారు. నిజానికి లెమన్ వాటర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లెమన్ వాటర్ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నిమ్మకాయ నీటిని రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది

నిమ్మకాయ నీరు ఆమ్లం స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి లెమన్ వాటర్ ను ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల మీ దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుంది. ఇది దంతాల సున్నితత్వం, ఇతర దంత సమస్యలకు దారితీస్తుంది. దీనిని నివారించడానికి స్ట్రా ద్వారా నిమ్మకాయ నీటిని తాగండి. అలాగే తాగిన తర్వాత మీ నోటిని నీటితో కడగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్

నిమ్మకాయ నీరు కడుపు ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొంతమందికి గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జిఇఆర్డి) చరిత్ర ఉంటే నిమ్మకాయ నీటిని తాగకపోవడమే మంచిది. 

నిర్జలీకరణం

నిమ్మకాయ నీరు మప శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగని ఈ వాటర్ ను మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. నిమ్మకాయ నీరు మూత్రవిసర్జనను పెంచుతుంది. అంటే ఇది మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. దీన్ని మోతాదుకు మించి తాగితే మాత్రం నిర్జలీకరణం సమస్య వస్తుంది. 

కడుపులో నొప్పి 

నిమ్మకాయ నీరు కూడా కొంతమందిలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన కడుపు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు నిమ్మనీటిని తాగితే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అలాగే వికారం, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి. 

చర్మపు చికాకు

నిమ్మకాయ నీటిని నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. అలా చేస్తే చర్మపు చికాకు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు కాలిన గాయలు లాంటి మచ్చలు ఏర్పడతాయి. నిమ్మరసాన్ని చర్మానికి అప్లై చేసే ముందు నిమ్మరసాన్ని నీటిలో కలపాలి. అలాగే స్కిన్ కు అప్లై చేసిన తర్వాత సూర్యరశ్మిలో ఉండకూడదు. 

మందులతో తాగకూడదు

 నిమ్మకాయ నీరు యాంటీ బయాటిక్స్, రక్తం పల్చబడటం వంటి కొన్ని మందులకు ఆటంకం కలిగిస్తుంది. మీరు ఏదైనా మందులను వాడుతున్నట్టైతే మీరు తినే ఆహారంలో నిమ్మకాయ నీటిని జోడించడానికి ముందు వైద్యుడిని అడగండి. 

click me!