ఎడమ వైపు తిరిగి పడుకునే అలవాటు లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే..!

By Mahesh RajamoniFirst Published Mar 25, 2023, 11:18 AM IST
Highlights

కొంతమంది బోర్లా పడుకుంటే.. ఇంకొంతమంది ఎడమవైపు, కుడి వైపు తిరిగి పడుకుంటారు. ఏదేమైనా ఎడమ వైపు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

మన ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర గంటలపైనే మన మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నిద్రతోనే మన శరీరం శక్తివంతంగా మారుతుంది. ఇది రీఫ్రెష్, పునరుత్తేజం వంటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మనం నిద్రపోయే భంగిమ కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎలాంటి  ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల ప్రేగుల ద్వారా వ్యర్థాలు సులువుగా కదులుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎడమ వైపు పడుకున్నప్పుడు మీ కడుపు, క్లోమం స్థానం మెరుగ్గా ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

గురకను తగ్గిస్తుంది

మీరు లేదా మీ భాగస్వామి గురక పెడితే..  ఎడమచేతివైపు తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఈ పొజీషన్ వాయుమార్గాలను క్లియర్ గా ఉంచుతుంది. దీంతో గురక చాలా వరకు తగ్గుతుంది. 

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది 

ఎడమ వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల మీ గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గుండెకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే మన గుండె ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

వెన్నునొప్పి నుంచి ఉపశమనం

వెన్నునొప్పితో బాధపడుతున్నారా?  అయితే ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. ఈ భంగిమ వీపుపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది

శరీరం నుంచి వ్యర్థాలు, విషాన్ని తొలగించడానికి శోషరస వ్యవస్థ పనిచేస్తుంది. ఎడమ వైపు నిద్రపోవడం వల్ల శోషరస కణుపులు సమర్థవంతంగా బయటకు తీయడానికి సహాయపడతాయి. ఇది శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

గర్భధారణ సమస్యలను తగ్గిస్తుంది

గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ భంగిమ మావికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, ప్రసవం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!