
ప్రస్తుతం సాంకేతికత ఎంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుందో.. వ్యాధులు కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. వ్యాప్తి చెందుతున్నాయి. పైగా కొత్త కొత్త సమస్యలను తీసుకువస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక్కటే మార్గమని చెప్పవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, చురుకైన జీవనశైలి, నాణ్యమైన నిద్ర మొదలైనవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎంత సంపాదించినా.. మన కోసం మనం సమయాన్ని కేటాయించుకుని స్వీయ సంరక్షణ చేసుకున్నప్పుడే.. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువకాలం సంతోషంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, సంతోషం రెండూ హెల్తీ లైఫ్ స్టైల్ పైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చాలామంది పురుషులు కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. కానీ తమ కోసం సమయాన్ని కేటాయించుకోలేరు. దీనివల్ల పురుషుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ పరిస్థితుల వల్ల పురుషులు మానసిక ఒత్తిడికి గురై అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎక్కువగా 30 ఏళ్లు దాటిన పురుషులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. 30 ఏళ్లు దాటిన పురుషులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ 4 యోగాసనాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మంచి నిద్రను పాటించాలి. దీని తర్వాత శరీరం చురుకుగా ఉండేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలి. జిమ్‌కు వెళ్లడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది అనేది నిజమే అయినప్పటికీ.. అక్కడికి వెళ్లలేకపోతే ఇంట్లో వ్యాయామాలు చేస్తూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో చేయడానికి కొన్ని సులభమైన వ్యాయామాలు ఉన్నాయి. కొన్ని యోగాసనాలు చేయడం వల్ల జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కండరాలు, ఎముకలు కూడా బలపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. దీనివల్ల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.
కడుపు, కాళ్ళు, వీపు వంటి శరీర భాగాలను కదిలించడానికి ఈ ఆసనం ఉత్తమం. దీన్ని చేయడం వల్ల కడుపు నొప్పి, వీపు నొప్పి వంటివి ఉంటే ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలు నయం కావడానికి కూడా ఈ ఆసనం సహాయపడుతుంది.
ఈ ఆసనం చేయడానికి ముందుగా రెండు కాళ్లు చాచి కూర్చోవాలి. మీ చేతులను కాళ్ల పక్కన ఉంచి ఆసనం చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ మీ చేతులను పక్క నుంచి వెనుకకు తీసుకెళ్లి తలపైకి పైకి ఎత్తండి. దీని తర్వాత ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వంగి, మోకాళ్లను వంచకుండా, కాళ్ళ బొటనవేళ్లను పట్టుకోండి. మీ నుదురు మోకాళ్లపై తాకాలి. ఈ స్థితిలో 5 సార్లు ఊపిరి పీల్చుకున్న తర్వాత పాత స్థితికి తిరిగి రావచ్చు. మీ సౌలభ్యం ప్రకారం ఈ ఆసనం 3 నుంచి 6 సార్లు చేయవచ్చు.
ఈ ఆసనం చేయడం అంత కష్టమేమి కాదు. కానీ దాని ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇది పురుషులు చేయగలిగే ఉత్తమ వ్యాయామం. ఈ ఆసనం చేసేటప్పుడు మొదట్లో కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ దీన్ని క్రమం తప్పకుండా చేస్తే వీపు కండరాలు బలపడతాయి. శరీర భంగిమ మెరుగుపడుతుంది. చూడటానికి మంచిగా కనిపిస్తారు. మానసిక ఒత్తిడి ఉన్నవారు దీన్ని చేసినప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.
ఈ ఆసనం చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. రెండు కాళ్లు కలిపి, చేతులను ఛాతీకి దగ్గరగా పక్కన ఉంచాలి. ఇది చేసిన తర్వాత ఊపిరి పీల్చుకోవాలి. ఊపిరి పీల్చుకుంటూ తల, ఛాతీ, నడుము వరకు పైకి ఎత్తాలి. ఇలా చేసేటప్పుడు మీ కడుపు నేలపై ఉండటం ముఖ్యం. ఊపిరి బయటకు వదులుతూ 5 సార్లు సాధారణంగా శ్వాసించాలి. దీని తర్వాత పాత స్థితికి తిరిగి రావచ్చు. ఈ ఆసనం రోజుకు 3 నుంచి 6 సార్లు చేయవచ్చు.
శరీరాన్ని సమతుల్యం చేయడానికి, మనసును తేలికగా చేసుకోవడానికి ఈ ఆసనం ఉత్తమమైనది. దీన్ని చేసినప్పుడు మీ అంతర్గత అవయవాలు బాగా పనిచేస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఆందోళన, మానసిక ఒత్తిడి ఉన్నవారు ఈ ఆసనం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత మీ ఎడమ కాలును వంచి కుడి తొడ లోపలి భాగంవైపు ఉంచాలి. ఇలా చేసేటప్పుడు కాలి వేళ్లు కిందికి ఉండటం అవసరం. ఊపిరి పీల్చుకుంటూ రెండు చేతులను కలిపి ఉంచాలి. ఆ తర్వాత ఊపిరి వదలాలి. ఇదే విధంగా 5 సార్లు సాధారణ శ్వాసను వదలాలి. ఇదే విధంగా మరో కాలుతో కూడా చేయాలి. ప్రతిరోజూ 3 నుంచి 4 సార్లు చేయవచ్చు.
పురుషులకు అనేక ప్రయోజనాలను అందించే ఆసనం వజ్రాసనం. ప్రతిరోజూ బైక్ పై వెళ్లేవారికి వీపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆసనం వీపు నొప్పి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆసనం చేసినప్పుడు ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది.
ముందుగా మీ కాళ్లు చాచి నిటారుగా కూర్చోండి. ఆ తర్వాత ఎడమ కాలును వంచి, పాదం కుడి మోకాలిని తాకేలా ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ కుడి చేతిని ఎడమ మోకాలిపైకి తీసుకెళ్లి ఎడమ చీలమండను పట్టుకోండి. ఇలా చేసేటప్పుడు మీ ఎడమ చేతిని వీపు వెనుక నేలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి వదులుతూ శరీరాన్ని ఎడమ వైపునకు తిప్పి వెనుకకు చూడాలి. ఈ స్థితిలో 5 సార్లు సాధారణ శ్వాసను వదలాలి. ఆ తర్వాత పాత స్థితికి తిరిగి రావచ్చు. ఇదే విధంగా కుడి వైపు కూడా చేయాలి.