Garlic Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Jun 15, 2025, 05:17 PM IST
garlic water

సారాంశం

వెల్లుల్లిని మనం చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.  

వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి లేకుండా చాలా రకాల వంటలకు రుచే లేదు. అంతేకాదు వెల్లుల్లి శక్తివంతమైన ఔషధంగా కూడా గుర్తింపు పొందింది. వెల్లుల్లి దాని ప్రత్యేకమైన వాసన, ఘాటైన రుచితో పాటు, లెక్కలేనన్ని ఔషధ గుణాలను కలిగి ఉంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.  

వెల్లుల్లి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

వెల్లుల్లి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక అద్భుతమైన డ్రింక్. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే మూలకం శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, వైరస్, బాక్టీరియా, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శక్తినిస్తుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి నీళ్లు వరం లాంటివి. వెల్లుల్లిలో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. దీని ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మెరుగైన జీర్ణవ్యవస్థ

వెల్లుల్లి నీళ్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వెల్లుల్లి ప్రేగులలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రపడి, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

బరువు నియంత్రణకు

వెల్లుల్లి నీళ్లు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ నీరు శరీరంలో జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి, అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి నీళ్లు మంచి ఎంపిక.

వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీళ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

వెల్లుల్లి నీళ్లు ఎలా తాగాలి?

ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను చితకొట్టి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తాగండి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం
Colon Cancer: 30 ఏళ్ల త‌ర్వాత ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయా.? క్యాన్స‌ర్ కావొచ్చు