టీడీపీ నేతలు అనుమతి అడగలేదు: గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్‌. జయలక్ష్మి

By narsimha lodeFirst Published Sep 11, 2019, 1:30 PM IST
Highlights

ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి టీడీపీ నేతలు తమ నుండి ఎలాంటి అనుమతిని కోరలేదని పోలీసులు స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే తాము బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ జయలక్ష్మీ తెలిపారు. 

అమరావతి: పల్నాడులో ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేలా ఎవరు ప్రవర్తించినా సహించబోమని గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్‌. జయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 

ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతి అడిగినా, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ నాయకులు అసలు ఎలాంటి అనుమతి అడగలేదన్నారు.మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. 

నిబంధనలను అతిక్రమిస్తే  కఠినచర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు..వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఉన్న తమ వారికి భోజనాలు రానివ్వటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 

అక్కడ ఉన్న వారంతా భోజనాలు చేశారని ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారని ఎస్పీ జయలక్ష్మి చెప్పారు.  ఛలో ఆత్మకూరుకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు బుధవారం నాడు పోటాపోటీగా పిలుపునిచ్చాయి.దీంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు: హౌస్ అరెస్ట్‌పై బాబు

1989లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు: ఆత్మకూరులో ఆసలేం జరిగింది?

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష

గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

click me!