గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్

By narsimha lodeFirst Published Sep 11, 2019, 7:45 AM IST
Highlights

చలో ఆత్మకూరుకు టీడీపీ, వైఎస్ఆర్2సీపీలు పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో బుధవారం నాడు టెన్షన్ వాతావరణం నెలకొంది.

గుంటూరు: చలో ఆత్మకూరుకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుజాగ్రత్తగా పలువురు టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల ఆధీనంలో ఉంది. గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఎన్నికల తర్వాత పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైఎస్ఆర్‌సీపీ దాడులతో టీడీపీకి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామాలను వదిలివెళ్లారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన బాధితులను గుంటూరులో శిబిరం ఏర్పాటు చేశారు.

బుధవారం నాడు ఉదయం ఉండవల్లిలో చంద్రబాబునాయుడు నివాసం వద్ద  టెన్షన్ వాతావరణం నెలకొంది.బాబు నివాసం వద్దకు వెళ్లే రహదారులను కూడ పోలీసులు  తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.గుంటూరులోని టీడీపీ కార్యాలయంలోకి పోలీసులు ఎవరిని కూడ అనుమతించడం లేదు. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని లోపలికి అనుమతించడం లేదని ఆ పార్టీ శ్రేణులు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.

ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి దేవినేని ఉమా,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ , టీడీపీ నేత వర్ల రామయ్య లను హౌజ్ అరెస్ట్ చేశారు

.విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడ పోలీసులు అడ్డుకొన్నారు. చంద్రబాబు నివాసానికి ఆయన వెళ్లకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మరో వైపు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడును బాబు నివాసం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఉండవల్లి నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంటి నుండి ర్యాలీగా బయలు దేరారు. పార్టీ కార్యాాలయానికి వెళ్తున్న లోకేష్ ను  పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో లోకేష్ ఇంట్లోకి వెళ్లారు.

మరో వైపు చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఉదయం గుంటూరు నుండి  ఆత్మకూరుకు బయలుదేరుతానని మంగళవారంనాడే ప్రకటించారు. టీడీపీ చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో పోటీగా వైఎస్ఆర్సీపీ కూడ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. బుధవారం నాడు ఆత్మకూరుకు తాడేపల్లి నుండి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు  బయలుదేరనున్నారు.

రెండు పార్టీలు కూడ పోటా పోటీగా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి.రెండు పార్టీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆత్మకూరులో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.గుంటూరులోనే అడిషనల్ డీజీ మకాం వేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని పోలీసులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం

వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు

click me!