మనలో చాలా మంది ఉదయం లేవగానే.. వెంటనే అద్దం ముందుకు వెళ్లి నిలపడి తమ ముఖం ఎలా ఉందా అని చూసుకుంటూ ఉంటారు. తమ ముఖంపై ఏమైనా ముడతలు వచ్చాయా? కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా? గీతలు ఏమైనా వచ్చాయా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా అమ్మాయిల్లో ఈ అలవాటు ఉంటుంది. తమ అందం ఏమైనా తగ్గుతుందా? ముసలోళ్లం అయిపోతున్నామా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏవైనా కాస్త ముఖంలో మార్పులు వచ్చినా తట్టుకోలేరు. వెంటనే మార్కెట్లో దొరికే క్రీములు, సీరమ్స్ కొనేసి.. వాటిని పూసేస్తూ ఉంటారు. కానీ.. మనం నిద్రపోయే విధానం వల్ల మీ అందం తగ్గుతుందని.. తొందరగా ముఖంపై ముడతలు రావడం మొదలౌతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
PSRI హాస్పిటల్ లోని నేచురోపతిక్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్య భక్తియాని ప్రకారం.. మనం నిద్రించే భంగిమలు కూడా చర్మ వృద్ధాప్యానికి ప్రధాన కారణం అవుతాయి. చాలా మంది బోర్లా పడుకోవడం , లేదా ఒక వైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. కానీ ఇలా పడుకోవడం వల్ల మన ముఖం దిండుతో ఒత్తిడికి గురౌతుంది. దీని వల్ల ఘర్షణ, ఒత్తిడి ఏర్పడి.. స్లీప్ లైన్స్ అని పిలిచే ముడతలు ముఖంపై వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, చర్మం కుంగిపోతుంది. కాలక్రమేణా నుదురు, బుగ్గలు, దవడ వద్ద ముడతలు ఎక్కువగా వచ్చేస్తాయి. వయసు మళ్లినవారిలా కనిపిస్తారు.

కళ్లు ఉబ్బడం..
ఉదయం లేచిన వెంటనే కంటి చుట్టూ ఉబ్బడం, ముఖంపై ముడతలు రావడం ఈ రోజుల్లో చాలా మందికి కామన్ అయిపోయింది. ఇదే రకంగా కంటిన్యూ అయితే అవి శాశ్వతంగా వచ్చే అవకాశం ఉంది. ఇది మీ అందాన్ని తగ్గించడమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. నిద్రపోయే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిద్ర భంగిమలను మార్చడం, సరైన దిండ్లు , ఫాబ్రిక్ వాడటం చర్మ వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డాక్టర్ భక్తియాని ప్రకారం, సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు కాటన్ కవర్లతో పోలిస్తే మృదువుగా ఉండి చర్మంపై ఘర్షణను తగ్గిస్తాయి. దీని వల్ల ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మెమరీ ఫోమ్ లేదా ఆర్థోపెడిక్ దిండ్లు తల, మెడకు సరైన మద్దతు ఇచ్చి ముఖంపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఎలా నిద్రపోవాలి?
నిపుణుల ప్రకారం, వీపుపై పడుకోవడం ఉత్తమం. ఇది ముఖంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అదనంగా, తలను కొంచెం ఎత్తుగా పెట్టుకుని నిద్రపోతే కళ్లు ఉబ్బకుండా, తాజాగా కనిపిస్తాయి.
ఫైనల్ గా...
మీ చర్మం యవ్వనంగా కనిపించడానికి.. క్రీములు, ట్రీట్మెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ నిద్రపోయే విధానం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. తగిన నిద్ర భంగిమలు, సరైన దిండ్లు, ఫాబ్రిక్ వాడటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యంగా ఎదుర్కొనవచ్చు. అందువల్ల, మీ నిద్ర అలవాట్లను మార్చుకోవడం ద్వారా సహజసిద్ధమైన అందాన్ని ఎక్కువకాలం కాపాడుకోవచ్చు.