సమంత సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు తాను స్కిన్ కేర్ కోసం ఫాలో అయ్యే ఉత్పత్తులను, ఫిట్‌నెస్ వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
సినీ తారలు ఎప్పుడూ అందంగా మెరిసిపోతూ ఉంటారు. స్కిన్ మీద మేకప్ తో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా... కొందరు సెలబ్రెటీలు మేకప్ లేకపోయినా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటివారిలో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. సెలబ్రెటీలు చాలా ఖరీదైన ఉత్పత్తులు వాడుతూ ఉంటారని చాలా మంది అనుకుంటారు. అయితే.. సమంత మాత్రం చాలా తక్కువ ఉత్పత్తులు మాత్రమే వాడుతుందట. సహజంగా అందంగా కనిపించడానికి తాను ఎలాంటి స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతుందో స్వయంగా వివరించింది.
సమంత సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు తాను స్కిన్ కేర్ కోసం ఫాలో అయ్యే ఉత్పత్తులను, ఫిట్‌నెస్ వీడియోలను రెగ్యులర్ గా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన స్కిన్ కేర్ సీక్రెట్ ని పంచుకుంది.
24
ఎక్కువ క్రీములు పూసేయదట...
చర్మ రక్షణ అనగానే చాలా క్రీములు రాయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. తాను మాత్రం చాలా తక్కువ ఉత్పత్తులు వాడతాను అని సమంత చెప్పడం విశేషం. ఒకప్పుడు చాలా రాసేదాన్ని అని.. ఇప్పుడు అవన్నీ ఏమీ రాయడం లేదు అని చెప్పింది. తన స్కిన్ కి ఎలాంటి ఉత్పత్తులు అయితే సూట్ అవుతాయో అలాంటివి మాత్రమే వాడతాను అని చెప్పింది.
34
సమంత స్కిన్ కేర్...
వాతావరణాన్ని బట్టి ప్రజల చర్మ సంరక్షణ దినచర్యలు మారడం సహజం. కానీ, మార్కెట్లో కి వచ్చే ప్రతి ప్రొడక్ట్ కొనేసి వాటిని వాడేయకూడదు అని, కేవలం మన స్కిన్ అవసరాన్ని బట్టి.. దానికి ఏది అవసరమో అదే వాడాలి అని ఆమె చెప్పింది. తాను మాత్రం తన స్కిన్ కేర్ లో భాగంగా రెటినోల్ వాడుతూ ఉంటానని చెప్పింది. ఈ రెటినోల్ టీనేజర్లకు అవసరం రాదు అని ఆమె చెప్పడం విశేషం. వీటితో పాటు.. తాను క్రమం తప్పకుండా.. సన్ స్క్రీన్, మంచి సీరమ్ వాడతాను అని సమంత చెప్పింది.
అందంగా కనిపించేందుకు చాలా మంది కేవలం క్రీములు రాస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ... ఆ క్రీములతో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం అని సమంత చెప్పింది. ఆరోగ్యంగా, అందంగా కనపడాలి అంటే.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం చాలా అవసరం. అందుకే.. క్రమం తప్పకుండా.. బరువులు ఎత్తడాలు, పైలేట్స్, యోగా వంటివి చేస్తూ ఉంటానని సమంత చెప్పడం విశేషం.