మనం స్నానం చేసే నీళ్లలో కొంచెం తేనె కలిపితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. నిపుణుల ప్రకారం.. ఈ వాటర్ మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాటర్ ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
రోజూ స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉండటమే కాకుండా.. ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాం. అయితే మనం స్నానం చేసే నీళ్లలో కొన్ని వస్తువులను కలుపుకుని చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి మన చర్మానికి మేలు చేయడమే కాకుండా.. మనల్ని రీఫ్రెష్ గా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో తేనె కూడా ఉంది. అవును స్నానం చేసే నీటిలో తేనెను కలిపితే మనం ఎన్నో చర్మ సమస్యలకు దూరంగా ఉంటాం. అసలు తేనె కలిపిన నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
స్నానపు నీటిలో తేనెను ఎలా కలపాలి?
తేనెను మనం స్నానం చేసే నీళ్లలో అలాగే కలపొచ్చు. ఇందుకోసం ఒక బకెట్ నీళ్లలో అందులో కొంచెం తేనెను వేసి కలపాలి. దీన్ని బాగా కలిపి స్నానం చేయొచ్చు. ఇలా స్నానం చేయడం వల్ల మీ చర్మం సాఫ్ట్ గా అవుతుంది. అలాగే అందంగా మెరిసిపోతుంది.
35
స్నానపు నీటిలో తేనెను ఎలా కలపాలి?
గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసేవారు కూడా తేనెను కలపొచ్చు. గోరువెచ్చని తేనె నీళ్లతో స్నానం చేయడం వల్ల మనం మరిన్ని చర్మ ప్రయోజనాలను పొందుతాం. ఈ వాటర్ మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే సాఫ్ట్ గా చేస్తుంది. వర్షాకాలంలో చాలా మంది చర్మం డ్రైగా అవుతుంది. ఇలాంటి వారు గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. అలాగే తేనెలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
45
స్నానపు నీటిలో తేనెను ఎలా కలపాలి?
మీరు స్నానపు నీళ్లలో ఒక్క తేనెను మాత్రమే కాకుండా లావెండర్ ఆయిల్ ను కూడా కలపొచ్చు. ఇందుకోసం ఒక బకెట్ నీళ్లలో లేదా బాత్ టబ్ లో కొన్ని చుక్కుల లావెండర్ ఆయిల్, తేనెను వేసి కలపండి. ఈ రెండింటిని కలిపిన నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీకు బాగా నిద్రకూడా పడుతుంది. ఒక పరిశోధన ప్రకారం.. తేనె వల్ల ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
55
స్నానపు నీటిలో తేనెను ఎలా కలపాలి?
అలాగే మీరు స్నానం చేయడానికి తేనెతో పాటుగా గంధపు నూనెను కూడా యూజ్ చేయొచ్చు. ఇందుకోసం ఒక బకెట్ వాటర్ లో గంధపు నూనె, తేనెను మిక్స్ చేయండి. గంధంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుస్కలంగా ఉంటాయి. దీనితో స్నానం చేయడం వల్ల వాపు, చర్మపు చికాకు, ఎరుపు, దురద తగ్గుతాయి. అయితే తేనెను వాడిన తర్వాత చర్మం జిగటగా అవుతుంది. అందుకే దీనితో స్నానం చేసిన తర్వాత నార్మల్ వాటర్ తో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో జిగట పోతుంది.