పీరియడ్స్ సమయంలో మహిళలకు విపరీతమైన కడుపులో నొప్పి, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్, మానసిక ఒత్తిడి, అలసట లాంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ తీవ్రమైన నొప్పి కారణంగా వారు ఏ పనీ చేయలేరు. విపరీతమైన రక్త స్రావం , బలహీనతకు కూడా దారితీస్తుంది
మరి, పీరియడ్స్ ఇంత ఇబ్బంది పెడుతున్న సమయంలో మహిళలు వాకింగ్ చేయగలరా? అసలు వాకింగ్ చేయవచ్చా? చేయకూడదా? వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మాసము సమయంలో వాకింగ్
పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయవచ్చా లేదా అనే సందేహం చాలా ఉంటుంది. అయితే.. ఆ సమయంలో వాకింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే మీ శరీరం ఎలా ఉందో మీకు తెలుసు. కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. గైనకాలజిస్టుల సలహా మేరకు, స్త్రీలు పీరియడ్స్ సమయంలో వాకింగ్ కాకుండా ఇతర వ్యాయామాలు కూడా చేయవచ్చు.
పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మెరుగైన రక్త ప్రసరణ..
పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేస్తే శరీరంలో మొత్తం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. ఇది కాకుండా, పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేస్తే రక్తస్రావాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. నొప్పి, వాపు రాకుండా నిరోధిస్తుంది.
మానసిక స్థితి మెరుగుపడుతుంది..
పీరియడ్స్ సమయంలో వాకింగ్ వంటి శారీరక శ్రమ ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది సహజంగానే మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాధారణంగా పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు మానసిక స్థితిలో మార్పులు లేదా చిరాకును కలిగిస్తాయి. కాబట్టి దీన్ని నివారించడానికి పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయడం మంచిది.
ఒత్తిడి తగ్గుతుంది..
పీరియడ్స్ సమయంలో పార్కు, పొలం, ప్రకృతి ప్రదేశాలు లేదా ఇంట్లోనే వాకింగ్ చేయవచ్చు. ఇది ఒత్తిడిని బాగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, పీరియడ్స్ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది.
మాసము సమయంలో వాకింగ్
బరువు నియంత్రణ..
క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం బరువు నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడానికి కూడా పీరియడ్స్ సమయంలో వాకింగ్ చేయవచ్చు. ఇది కొన్ని పీరియడ్స్ అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది..
పీరియడ్స్ సమయంలో వాకింగ్ వంటి శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల గుండు ఆరోగ్యం మెరుగుపడుతుంది, కండరాలు బలపడతాయి, శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
మాసము సమయంలో వాకింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు:
రక్తస్రావం పెరుగుతుంది..
మాసము సమయంలో వాకింగ్ వంటి వ్యాయామం చేసేటప్పుడు కొంతమంది స్త్రీలకు రక్తస్రావం పెరుగుతుంది. ఇది తాత్కాలిక పెరుగుదల. ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు.
కండరాల అలసట..
పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు లేదా తీవ్రమైన వాకింగ్ కండరాల అలసటకు దfrరోహం చేస్తుంది. ముఖ్యంగా కాళ్ళలో ఎక్కువ శారీరక శ్రమ అలసట, నొప్పులు వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఆరోగ్య సమస్యలు..
పీరియడ్స్ సమయంలో స్త్రీలు శారీరక శ్రమలో పాల్గొనేటప్పుడు శరీర పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అసౌకర్యం, చిరాకును నివారించడానికి శానిటరీ ప్యాడ్‌లను మార్చుకోవాలి.
గమనిక : సాధారణంగా పీరియడ్స్ సమయంలో ఇటువంటి లక్షణాలు రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటాయి. వాకింగ్ వంటి వ్యాయామం వీటిని తగ్గించడంలో సహాయపడుతుంది.