ముఖానికి అరటిపండును పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 17, 2024, 12:12 PM IST

సాధారణంగా అరటిపండును తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఈ పండు స్కిన్ కేర్ గాకూడా ఉపయోగపడుతుంది. అవును ఈ పండు గుజ్జును ముఖానికి పెడితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

మనలో చాలా మంది అరటిపండును రెగ్యులర్ గా తింటుంటారు. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఈ పండును ఉపయోగించి మనకున్న ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. 

నిపుణులు ప్రకారం.. బాగా పండిన అరటిపండు మన చర్మానికి ఎంత మేలు చేస్తుంది. ఈ పండులో ఉండే గుణాలు మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. అలాగే బాగా పండిన అరటిపండును ముఖానికి రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది

అరటిపండు మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే అరటిపండును అరటి పండును చర్మానికి అప్లై చేయడం వల్ల మన చర్మానికి తేమ అందుతుంది. అలాగే స్కిన్ డ్రై అయ్యే అవకాశం కూడా పోతుంది. అరటిపండును ఉపయోగించి నిర్జీవమైన, నిస్తేజమైన చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
 


banana

హైడ్రేట్ చేస్తుంది

అరటి పండును ముఖానికి రాసుకోవడం వల్ల మీ చర్మం హైడ్రేట్ అవుతుంది. అలాగే ఇది మన ముఖాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. ఈ అరటిపండును వాడితే మన చర్మం మునుపటి కంటే మరింత అందంగా మెరిసిపోతుంది.

వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది

ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేయడానికి అరటిపండు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ -సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం బిగుతుగా అవుతుంది. దీంతో వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.
 

మరకలు తొలగిపోతాయి 

అరటి పండ్లలో ఉండే లక్షణాలు మన చర్మాన్ని మరింత మెరిసేలా చేయడానికి బాగా సహాయపడతాయి. దీన్ని తరచుగా ముఖానికి రాయడం వల్ల మీ ముఖంపై ఉండే మరకలు, మొటిమల మచ్చలు, ఇతర మచ్చలు లేకుండా పోతాయి. 

మొటిమలు తగ్గుతాయి

అరటి పండ్లలో ఉండే పోషకాలు మన చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించడానికి బాగా సహాయపడతాయి. దీన్ని ఉపయోగించి ముఖంపై ఉండే మొటిమలు పూర్తిగా తొలగించొచ్చు. అలాగే ఇది మొటిమల వల్ల అయ్యే మచ్చలను కూడా పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
 


మృత కణాలను తొలగిస్తుంది

అరటి పండు గుజ్జును ముఖానికి పెట్టడం వల్ల మీ చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీంతో ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పూర్తిగా పోతాయి. దీంతో మీ ఫేస్ క్లియర్ గా ఉంటుంది. 

ఎలా ఉపయోగించాలి?

బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని మెత్తగా నూరి దాంట్లో తేనె మిక్స్ చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. అరటి పండుతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. 

Latest Videos

click me!