ఇవి తింటే జుట్టు అస్సలు ఊడిపోదు

First Published Oct 19, 2024, 2:27 PM IST

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తే కూడా జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు గనుక కొన్నింటిని తింటే మీ జుట్టు అస్సలు ఊడిపోదు. 

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల నూనెలను, షాంపూలను, ఇంటి చిట్కాలను ట్రై చేస్తుంటారు. అయినా జుట్టు మాత్రం పెరగని వాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. 

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, కలుషిత నీరు, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటితో పాటుగా శరీరంలో పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది.

నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల విత్తనాలు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే మీ జుట్టు  ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


black sesame seeds

జుట్టు ఊడిపోకుండా చేయడానికి సహాయపడే విత్తనాలు

నల్ల నువ్వులు

నువ్వులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల నువ్వులు, రెండు నల్ల నవ్వులు. అయితే నల్ల నువ్వులు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మీ  జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు తెల్ల బడటం కూడా తగ్గుతుంది. 

నల్ల నువ్వుల్లో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, రకరకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు అవసరమైన మంచి పోషణను అందిస్తాయి.

అలాగే జుట్టు మూలాలను కూడా బలంగా చేయడానికి సహాయపడతాయి. వీటిని తింటే మీ జుట్టు ఆకృతి కూడా మెరుగుపడుతుంది. నల్ల నువ్వులను మీ ఆహారంలో భాగం చేసుకోవడానికి స్టిర్ ఫ్రై లేదా కాల్చి మీ ఫుడ్ పై చల్లి తినొచ్చు. 
 

చియా విత్తనాలు

చియా విత్తనాలు పోషకాలకు మంచి వనరు. వీటిని జుట్టుకు సూపర్ ఫుడ్స్ బా కూడా భావిస్తారు. చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా మెండుగా ఉంటాయి.

ఈ విత్తనాలు జుట్టును బలంగా చేయడానికి బాగా సహాయపడుతుంది. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. చియా విత్తనాలను స్మూతీలు, పెరుగు లేదా పుడ్డింగ్లకు జోడించి తినొచ్చు. 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్ని తినే వారు చాలా తక్కువ మందే. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. నిజానికి గుమ్మడికాయ గింజలు జుట్టు ఆరోగ్యానికి పోషకాలతో నిండిన పవర్ హౌస్ గా పనిచేస్తాయి. ఈ విత్తనాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెత్తిమీద మంచి నూనె ఉత్పత్తి చేసే గ్రంథులను నిర్వహిస్తుంది. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. 

ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడానికి, జుట్టు తెగిపోకుండా, రాలిపోకుండా, చీలిపోకుండా ఉండటానికి బాగా సహాయపడతాయి. ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలంటే ఉదయాన్నే వేయించిన గుమ్మడికాయ గింజలను తినండి. 

നോക്കാം. 

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ జుట్టు రాలిపోకుండా చేసి బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది ఈ విత్తనాలు మీ నెత్తిని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను ఎండబెట్టి సలాడ్లలో కలిపి తినొచ్చు. 

click me!