Fridge: ఆడవాళ్లు మార్కెట్ లో కొన్న ప్రతి కూరగాయనూ ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీనివల్ల కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మనలో ప్రతి ఒక్కరూ పండ్లను, కూరగాయల్ని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల పండ్లు, కూరగాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. మురిగిపోకుండా ఉంటాయి. ఫ్రిజ్ వీటిని చాలా కాలం పాటు పాడవకుండా కాపాడుతుంది.
ముఖ్యంగా చాలా మంది ఆడవారు మార్కెట్ లో కొన్న ప్రతి కూరగాయను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
కీరదోసకాయ
కీరదోసకాయలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇవి బయట ఉంటే తొందరగా వాడిపోయి పాడవుతాయని చాలా మంది వీటిని ఫ్రిజ్ లోనే పెడుతుంటారు. కానీ కీరదోసకాయను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద. ఎందుకంటే దీనివల్ల కీర దోసకాయ త్వరగా పాడైపోతుంది. అందుకే కీరదోసకాయల్ని ఎప్పుడూ కూడా ఫ్రిజ్ లో పెట్టకండి.
35
టమాటాలు
టమాటాలు ఫ్రిజ్ లో పెడితే మురిగిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్ గా కనిపిస్తాయి. అందుకే చాలా మంది టమాటాలను కొనేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ టమాటాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల టమాటాల రుచి తగ్గుతుంది. అందుకే టమాటాలను ఎప్పుడూ కూడా గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి. వీటిని సపరేట్ గా ఒక బుట్టలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
ఆలుగడ్డలు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ ఆలుగడ్డలను ఫ్రిజ్ లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆలుగడ్డలు పాడై పోయి తొందరగా మొలకలు వస్తాయి.
55
ఉల్లిపాయ
ఉల్లిపాయల్ని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు తొందరగా పాడైపోతాయి. అందుకే ఉల్లిపాయల్ని ఎప్పుడూ కూడా చల్లగా గాలి తగిలే ప్రదేశంలో సపరేట్ గా నిల్వ చేయాలి. అప్పుడే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.